హైస్కూల్ లెసన్స్ ఇన్ తెలుగు మొబైల్ యాప్స్

ఎవరికైనా…ఎలాంటి వారికైనా బాల్యంలో ముఖ్యమైన కాలం అంటే హైస్కూల్ విద్యాకాలమే! ఈ కాలంలో కలిగే శ్రద్ద జీవితంపై ప్రభావం చిరకాలంగా చూపుతూ ఉంటుంది…అంటారు. మరి అలాంటి హైస్కూల్ విద్య అభ్యసిస్తున్న కాలంలో శ్రద్ద విద్యావిషయములపై కాకుండా ఇతర విషయములలో ఉంటే, చదువులో వెనకబడే అవకాశాలు ఎక్కువ.

బాలబాలికలలో ఆసక్తి లేనప్పుడు, వారికి ఇష్టమైన వస్తువు ఏదో తెలుసుకుని, ఆ వస్తువు ద్వారా వారికి భవిష్యత్తులో ఉపయోగకరమైన అంశాన్ని అందించాలని పెద్దలు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా అయితే…. ఈనాటి సాంకేతిక కాలంలో స్మార్ట్ ఫోను ఇష్టపడనివారుండరు. స్మార్ట్ ఫోను ద్వారా పాటలు / మ్యూజిక్ వినని వారుండరు. అటువంటి స్మార్ట్ ఫోను ద్వారా హైస్కూల్ విద్యా విషయములను వారికి అందిస్తే, స్మార్ట్ ఫోను ద్వారా వారు పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరచవచ్చును.

అలా స్మార్ట్ ఫోను ద్వారా విద్యావిషయములను 10వతరగతి పాఠ్యాంశాలు అందించే మొబైల్ యాప్స్ కొన్నింటిని చూద్దాం…

Telugu Stories (moral) – నీతి కధలు

చిన్నప్పటి నుండే నీతికధలు వినడం వలన, తల్లి చెప్పిన పురాణ గాధలు వలననే చత్రపతి శివాజీకి మహిళలు అంటే ఎనలేని అభిమానం పెరిగింది. అలాగే ఎందరో భారతీయ మహిళల మాన, ప్రాణాలను కాపాడిన రాజుగా కీర్తీని గడించాడు. అందువలన… బాల్యం నుండే బాలబాలికలకు నీతి కధలను వినిపించడం, చదివించడం లాంటివి చేస్తే, వారు భవిష్యత్తులో ఉత్తమ జీవనం సాగించే అవకాశంతో పాటు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వారుగా ఉండే అవకాశం ఉంటుంది. తెలుగులో నీతి కధలను అందించే మొబైల్ యాప్ గూగులో ప్లేస్టోర్లో మనకు ఉచితంగా లభిస్తుంది. డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

General Science in Telugu – జనరల్ సైన్స్

వ్యక్తి చుట్టూ ఉండే సమాజంలోను, వ్యక్తి జీవితంలోను ఉపయోగించే, లేక సమాజాన్ని ప్రభావితం చేసే విషయాలలో సైన్సు భాగమై ఉంటుంది. అటువంటి సైన్స్ గురించి తెలుసుకోవడం, అవగాహన కలిగి ఉండడం అందరికీ అవసరమే, హైస్కూల్ పాఠ్యాంశాలలో సైన్స్ మూడు భాగాలుగా బయోలాజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ గా విభజించి ఉంటుంది. అటువంటి జనరల్ సైన్సు సబ్జెక్టును తెలుగు అందించే మొబైల్ యాప్ జనరల్ సైన్స్ ఇన్ తెలుగు. ఈ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని, పిల్లలకు ఖాళీ సమయాలలో చూపిస్తే, సైన్సు గురించి చదువుకుని, సైన్సుపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ లేక క్లిక్ చేయండి.

10th Class Math Formula – 10 క్లాస్ మాథ్స్ ఫార్ములాస్

ఇంజనీరింగ్లో నిష్ణాతులు కావాలంటే, మాథ్స్ బాగా రావాలంటారు. కానీ కొంతమందికి మాథ్స్ అంటే కష్టమంటారు, కొంతమంది మాథ్స్ ఇష్టమంటారు. కొందరంటారు మాథ్స్ అర్ధమయ్యితే అంత తేలికైనా సబ్జెక్టు మరొకటి లేదంటారు. అయితే మాథ్స్ లో శ్రద్ధపెడితే, నూటికి నూరు(100%) మార్కులు తెచ్చుకోవచ్చును. చిన్ననాటి నుండి మాథ్స్ పై ఆసక్తి పిల్లలో పెరిగితే, చదవుతోనే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చును అంటారు. 10వ తరగతి మాథ్స్ సబ్జెక్టులో ఉండే ఫార్ములాస్, వివిధ చాప్టర్లను అందించే మొబైల్ యాప్ మనకు గూగుల్ ప్లేస్టోర్లో ఉచితంగా లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

Telugu GK & Current Affairs – తెలుగు జి.కె. మరియు కరెంట్ అఫైర్స్

జనరల్ నాలెడ్స్ అందరికీ అవసరం అయితే, చదువుకునే పిల్లలకు మరీ ముఖ్యం! వివిధ సబ్జెక్టులు వారీగా సమాజంలో జరిగిన, జరుగుతున్న చారిత్రక, సామాజిక, సాంకేతిక అంశాలలో విశేషాలను తెలుసుకోవడం విద్యార్ధులకు చాలా అవసరం. డైలీ పేపర్స్, వీక్లి పేపర్స్ లాంటివి చదివేవారికి కొంత జి.కె. గురించి తెలిసి ఉంటుంది. ప్రత్యేకంగా వివిధ రంగాలలో జరిగిన, జరుగుతున్న విశేషాలను అందించే జి.కె. మరియు కరెంట్ అఫైర్స్ బుక్స్ మార్కెట్లో లభిస్తూ ఉంటే, సాంకేతికంగా ఉచితంగా లభిస్తాయి. తెలుగు జి.కె. మరియు కరెంట్ అఫైర్స్ మొబైల్ యాప్ ద్వారా జికె అభివృద్ది చేసుకోవచ్చును. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్/క్లిక్ చేయండి.

Little things to listen for High-School Students – లిటిల్ థింగ్స్ ట లిజన్

చదవడం కన్నా వినడం తేలిక, వినయంగా వినడం వలన విషయ సారంశం మనసులోకి బాగా చేరుతుంది. ఒక్కసారి విన్న విషయం గురించి, మరలా చదువుతూ ఉంటే, ఆ విషయంపై ఆసక్తి బాగుగా పెరుగుతుంది. క్లాసులో కొందరు వినడం ద్వారా వచ్చిన, ఆసక్తిని చదవడం ద్వారా అవగాహన పెంచుకుంటారు. ఆసక్తిని కలిగించడంలో మరొక ఆసక్తికరమైన వస్తువు ఉపయోగపడుతుంది, అంటారు. అలా చదువులో ఆసక్తి పెంచుకోవడంలో మనకు స్మార్ట్ ఫోను ఒక సాధనంగా మార్చుకోవచ్చును.

లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను నుండి హైస్కూల్ లెసన్స్ ఆడియోగా వినవచ్చును. లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, బయోలాజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ సబ్జెక్టులు ఆడియో ఫైళ్ల రూపంలో మనకు ఉచితంగా లభిస్తున్నాయి. వినడం వలన ఆసక్తిని పెంచుకుని, సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవచ్చును అంటారు.

లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును, ఉచితంగా హైస్కూల్ పాఠ్యాంశాలను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను ద్వారా వినవచ్చును. ఈ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి, ఇక్కడ ఇవే అక్షరాలను టచ్/క్లిక్ చేయండి.