Sunday, November 18, 2018
Home > vegadget > Jio GigaFiber Registrations Starting August 15

Jio GigaFiber Registrations Starting August 15

Jio GigaFiber Registrations Starting August 15

Jio GigaFiber Registrations Starting August 15

Jio GigaFiber Registrations Starting August 15 – జియో డేటా పధకాలతో, మొబైల్ ఫోన్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బాండ్ సేవల కోసం నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఆగష్టు 15 indepenence day సందర్భంగా ఈ రిజిస్ట్రేషన్లు ఆన్ లైన్లో జియో వెబ్ సైట్ లేక మైజియో మొబైల్ ఆప్ ద్వారా పేరు వివరాలు నమోదు చేసుకోవచ్చు.

Reliance Jio GigaFiber సర్వీసులు సుమారు 1100 సర్కిల్లలో అందించనున్నట్టు చెబుతున్నారు. బుధవారం నుండి అందుబాటులోకి రానున్న Reliance Jio GigaFiber నమోదు ప్రక్రియ, గరిష్ట నమోదులను అనుసరించి సేవలు ప్రారంభం అవుతాయి అని ముఖేష్ అంబానీ ప్రకటించారు. అంటే ఎక్కువ registrations ఏ ఏ ప్రాంతాల్లో జరిగితే ఆయా ప్రాంతాలలో Jio GigaFiber Service అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి  ఆదరణ ఉన్న చోట ముందుగా రానున్న ఈ సర్వీసులు మరో సంచలనం కాబోతుంది. ఇప్పటికే మొబైల్ రంగంలో సర్వీసు ప్రొవైడర్లకి గట్టి పోటి ఇచ్చినట్టు, బ్రాడ్ బాండ్ సేవలలో కూడా పోటి కానుంది. అలాగే Jio GigaTV సర్వీసులు కూడా ప్రారంభం Jio GigaFiber Registrations Starting August 15 అయితే, జియో గిగాఫైబర్ కి డిమాండ్ పెరుగుతుంది.


Reliance Jio GigaFiber Plans

సమాచారం ప్రకారం Reliance Jio GigaFiber పధకాలు నెలవారీ రూ.500లతో ప్రారంభం అవ్వనున్నాయి. 30 రోజుల పధకంలో నెలకి రూ.500ల పధకంలో 50 MBPS వేగంతో 300GB వరకు నెట్ వేగంగా వస్తుంది. ఈ పధకం ప్రారంభ పదకంగా ఉంటే, దీని కన్నా ఎక్కువ డేటా కావాలంటే నెలకి రూ.750ల పధకం ఉంటుంది. ఈ పధకంలో 30 రోజుల కాల పరిమితిలో 450GB డేటా 50MBPS వేగంతో ఉంటుంది.

తరువాత పధకం ధర రూ.999లతో 30 రోజుల కాలపరిమితిలో 600GB డేటా 100MBPS వేగంతో ఉంటుంది. అలాగే రూ.1299ల పధకంలో అయితే 100MBPS వేగంతో 750GB వరకు 30 రోజులకు గాను వేగవంతమైన డేటా పొందవచ్చు. చివరగా రూ.1500ల పధకంలో గరిష్టంగా 150MBPS వేగంతో ఒక నెలకి గాను 900GB వేగవంతమైన డేటా పొందవచ్చు.

జియో డేటా పధకాలతో సాదారణ ఫోను వాడే వినియోగదారులు స్మార్ట్ ఫోను వినియోగదారులుగా మారినట్టు, JioGigaFiber వలన సాదారణ టివిల నుండి స్మార్ట్ టివిల వాడుక పెరిగే అవకాశాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో ప్రస్తుత డేటా అయితే 509 లకు రోజువారి 4GB ప్రకారం 28 రోజులకు 112GB వేగంగా అందిస్తుంది. ఇప్పుడు ఇదే ధరలో బ్రాడ్ బాండ్లో సేవలలో భాగం JioGigaFiber ద్వారా రూ.500 లకు గాను 30 రోజులకు 300GB ఇవ్వనున్నారు. ఈ పధకాల ప్రకారం నెట్ వినియోగదారులకు ఇంకా వేగవంతంగా ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. అపరిమితంగా డౌన్ లోడ్ సదుపాయం అందించే కేబుల్ బ్రాడ్ బాండ్ సేవలతో ఇవి ఎంతవరకు పోటి పడతాయో చూడాలి.

ఆగష్టు 15 నుండి ఈ JioGigaFiber రిజిస్ట్రేషన్లు jio.com ద్వారా లేకా myjio మొబైల్ ఆప్ ద్వారా చేసుకోవచ్చు. మొబైల్ ఆప్ కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vega2020

bpr