Moto G6 & G6 Play Latest Android Mid-Range Smartphones

Moto G6 & G6 Play Latest Android Mid-Range Smartphones

Moto G6 & G6 Play Latest Android Mid-Range Smartphones మోటో G6 కొత్తగా విడుదల అవుతున్న స్మార్ట్ మొబైల్, మిడ్ రేంజ్ ధరలలో ఆధునిక సదుపాయాలతో సరైన నాణ్యతతో లభించడం మోటో జి సిరీస్ యొక్క ప్రత్యేకత. ఇంతకుముందు మోటో జి సిరీస్ నుండి వచ్చిన జి5 ప్లస్ ఫోన్ బాగా విజయవంతమైనది అయితే ఇప్పుడు మోటో జి6 మరియు జి6 ప్లే స్మార్ట్ ఫోన్లు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లలో ఈ రోజు అర్ధరాత్రి నుండే అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయి.

మోటో జి6 స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఒరియో 8.0, స్క్రీన్ సైజు 5.7″, డ్యూయల్ రేర్ కేమేరాస్ క్వాలిటీ వచ్చి 12 & 5 మెగా పిక్సెల్, తక్కువ కాంతి మోడ్లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,  ఫ్రాన్ కెమెరా వీడియో రికార్డింగ్ క్వాలిటీ 30 ఫ్రేమ్స్, వీడియో ఫ్రేమ్స్ 60, ఇంకా ప్రాసెసర్ స్పీడ్ 1.8 GHz అక్ట కోర్, 3/32 4/64 రామ్ / ఫోన్ మెమరీ లతో రెండు రకాలుగా వేరు వేరు ధరలలో లభించనున్నాయి. మరియు ఫోన్ అన్ లాకింగ్ పేస్ మరియు ఫింగర్ ప్రింట్ ద్వారా చేయవచ్చు. ౩౦౦౦ mAh బాటరీ సామర్ధ్యంతో బాటు క్విక్ ఛార్జింగ్, స్ప్లాష్ ప్రూఫ్, ఇంకా క్విక్ స్క్రీన్ షాట్, వన్ బటన్ నావ్, మొదలైన మోటో క్విక్ ఏక్సన్స్, ఇంకా బ్లూ టూత్, వైఫై, జిపిఎస్, హెడ్ ఫోన్, జాక్, యుఎస్బి, 4జి, డ్యూయల్ నానో సిమ్ మొదలైన సదుపాయాలతో మోటో జి6 రూ.13999/- లలో 3/32 gb రామ్ మరియు ఫోన్ మెమరీ ఫోన్ లభిస్తే, 4జిబి రామ్ 64 జిబి ఫోన్లు రూ.15999/- ల ధరలో అమెజాన్ వెబ్ సైట్లో లభిస్తున్నాయి. అమెజాన్ వెబ్ సైట్ నుండి హెచ్.డి.ఎఫ్.సి. కార్డు ద్వారా రూ.1250/- లు రాయితీ పొందవచ్చు.



మోటో జి6 ప్లే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్

మోటో జి6 ప్లే మాత్రం కెమెరా క్వాలిటీలో 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3/32 రామ్ మరియు ఫోన్ మెమరీ కలిగి ఉంటుంది. స్క్రీన్ రిజల్యుషన్, ప్రాసెసర్ స్పీడ్, డిస్ప్లే క్వాలిటీ మోటో జి6 కన్నా తక్కువగా ఉన్నా బాటరీ సామర్ధ్యం మాత్రం 4000 mAh కలిగి ఉంటుంది, ధర కూడా మోటో జి6 కన్నా రెండువేలు తక్కువగా ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో నేటి అర్ధరాత్రి నుండి రూ.11999/- ల ధరలో లభించనున్నాయి.

సాధారణంగా కొన్ని బ్రాండెడ్ మొబైల్స్ నాణ్యత కలిగి ఉండి, ఫీచర్స్ విషయంలో లేటెస్ట్ కాకుండా ఓల్డ్ సదుపాయాలతో మిడ్ రేంజ్ ఫోన్లు ఉంటాయి. కానీ షియోమి రెడ్ మి స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మాత్రం పోటి పెరిగింది. అప్పటికే మోటో నుండి మోటో e, మోటో జి మొదటి సిరీస్ ఫోన్లు వచ్చి మంచి ఆదరణ పొందాయి. తరువాత మోటో ఇ సిరీస్లో E4 వరకు, జి సిరీస్లో జి5 ప్లస్ వరకు కంటిన్యూ అయితే ఇప్పుడు మోటో e5 ప్లస్ త్వరలో విడుదల అవుతుందని న్యూస్ అయితే మోటో జి6 మరియు జి6 ప్లే ఫోన్లు ఈ రోజు ఆన్ లైన్ అమ్మకాలు కొనసాగనున్నాయి.

Moto G6 & G6 Play Latest Android Mid-Range Smartphones
మోటో జి6 ప్లే
Moto G6 & G6 Play Latest Android Mid-Range Smartphones
మోటో జి6

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *