Sunday, November 18, 2018
Home > View Enlisted Gadget Apps > Must Know About Your Installed Mobile App Access Features

Must Know About Your Installed Mobile App Access Features

Must Know About Your Installed Mobile App Access Features Of Smartphone

Must Know About Your Installed Mobile App Access Features Of Smartphone, Read in Telugu: స్మార్ట్ ఫోన్(Smartphone) ఫీచర్ మొబైల్ ఫోన్ (Mobilephone) ఏదోకటి ప్రతివారి చేతిలో ఉంటూ ఉంటుంది. ఉండవలసిన పరిస్థితిలో సమాజం(society) అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రతిఒక్కరు వాడవలసిన వస్తువు(Needed Item) గా మారితే, అది కొంతమందికి విలస వస్తువుగా(Entertaining Item) కూడా ఉపయోగపడితే, కొంతమందికి విజ్ఞాన పరిచయ వస్తువు(Knowledge Viewing Item) గా ఉపయోగపడుతుంది.

వస్తువు ఉపయోగం ఎక్కువగా ఉండి ఆవస్తువుకి అవసరం (Demand of the Item) ఉంటే, దానిపై వాణిజ్య వ్యవస్థ దృష్టిపడుతుంది. అటువంటిది వ్యాపారం చేసే భూమికగా (Selling Source) అయితే, దానికి అన్నిరకాల డిమాండ్స్ ఏర్పడుతాయి. సేవలు అవసరం అవుతాయి, సేవలు పెరుగుతాయి.

పెద్ద పెద్ద నగరాలలో ఎక్కువగా జనసంచారం జరిగే చోట్లు వ్యాపార ప్రదేశాలు గుర్తించి అక్కడ వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు ఏర్పడితే, ప్రత్యేకంగా షాపింగ్ చేయడానికి సదరు సెంటర్కి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఆన్ లైన్ షాపింగ్ మొదయ్యాక ఆన్ లైన్ స్టోర్స్ ఏర్పడడంతో బౌతిక పరిశీలన అవసరం అనుకుంటేనే బౌతికంగా ఉన్న షాపులలో షాపింగ్ చేయడానికి యువత మొగ్గు చూపుతున్నారు. సాదారణ అవసరాలు, ఎలక్ట్రానిక్ వంటి వస్తువులని ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫాస్ట్ షాపింగ్ చేయడానికి స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది ఇకామర్స్ మొబైల్ ఆప్స్ ద్వారా.




సోషల్ మీడియాలో అనేకరకమైన ఆలోచనలు పంచుకోవడం, తెలుసుకోవడం, సామజిక విషయాలపై అభిప్రాయాలు తెలియజేయడం, తెలుసుకోవడం. బ్రౌజింగ్లో వింతలు కనిపిస్తే స్నేహితులతో పంచుకోవడం, లేదా స్నేహితులు పంచుకున్నవి తెలుసుకోవడం. ఇలా కొన్ని విషయాలు స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా మొబైల్ ఆప్స్ ద్వారా వేగంగా తెలిసే అవకాశాలు ఎక్కువ.

అభిమాన సినిమా స్టార్స్ లేక సామజిక ప్రసిద్ద వ్యక్తుల, క్రీడాకారుల, క్రీడల వార్తలు, విశేషాలు తెలుసుకోవడం, తెలిసినవి తెలియజేయడం వంటివి ఎక్కువగా సోషల్ మీడియా వెబ్ సైట్లలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఎక్కువగా అభిమాన హీరో హీరోయిన్స్ సినిమా విశేషాలు, వాళ్ళ చిత్రాలపై కామెంట్స్ కొనసాగుతూ యువతను ఆకర్షిస్తాయి.

సామాజికంగా సాంకేతిక విషయలపై వివరాలు, సాంకేతిక విషయాలు నేర్పించే సేవసంస్థల వివరాలు, సాంకేతిక పరికరాలపై వార్తలు, ఉపయోగాలు, సాంకేతిక పరిజ్ఞానంపై వివరణలు, సాంకేతికంగా విషయలు తెలుసుకోవడంలో స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్స్ ద్వారా ఒక సహాయకారిగా యువతకు ఉంటుంది. సాంకేతిక వీడియోలు యూట్యూబ్ మొబైల్ ఆప్ ద్వారా అనేకం తెలుసుకోవచ్చు.

Must Know About Your Installed Mobile App Access Features Of Smartphone

స్మార్ట్ ఫోన్ కూడా ఒక సాంకేతిక పరికరం కావునా సాంకేతిక సంశయాలు సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేనివారికి కలుగుతూ ఉంటాయి. అలాంటి వారికీ స్మార్ట్ ఫోన్ ఎలా ఉపయోగించాలో సాంకేతిక సలహాలు కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వలన సోషల్ మీడియా యువతకు మరియు అందరికి మరింత దగ్గరగా అవుతుంది.

సాంకేతిక పరికరాలు పనిచేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్లు గురించిన కోర్సులలో ఉండే సందేహాలు తీర్చుకోవడంలో, వాటిని షేర్ చేయడంలో, అలాగే సదరు విషయాలపై వివరణలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వన్ని కూడా మొబైల్ ఆప్స్ ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నందున స్మార్ట్ ఫోన్ ప్రత్యేకంగా యువతకు అవసరమైన వస్తువుగా మారుతుంది.

చక్కగా ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్స్ ద్వారా అనేక ఉపయోగాలు అందించే అవకాశాలు చాలానే కనబడతాయి. అలా కోర్సులు, చదువులో సబ్జెక్టు పరమైన సందేహాలు తీర్చడంలో కొన్ని ఆఫ్ లైన్ మొబైల్ ఆప్స్ ఉంటే, మరి కొన్ని లైవ్ మొబైల్ ఆప్స్ లభిస్తాయి. చదువుకుంటున్న యువతకు స్మార్ట్ ఫోన్ ఒకరకంగా ఉపయోగాదాయకం అవుతుంది.

కాలం మారుతున్నా కొద్ది సాంకేతికత అభివృద్ధి చెంది, అనేక మార్పులతో కొత్తగా సాంకేతిక పరికరాలు మారుతుంటే. సాంకేతికత పరిజ్ఞానం ఉంటున్న యువత కూడా కొత్తగా వస్తున్న సాంకేతిక పరికరాలపై ఆకర్షితం అవ్వడం సహజమే. కొత్త ఎప్పుడూ వింతగా ఉంటే, అదే ఎక్కువమార్లు జరిగితే కొత్తకూడా పాతే.

మొదట్లో మొబైల్ ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడడం, సందేశాలు పంపడంలో ప్రజలకు సహాయపడుతూ, రేడియేషన్ అనే ఒక ప్రమాదకర విషయంపై చర్చలు సృష్టించింది. మొబైల్ టవర్ రేడియేషన్ వలన మొబైల్ టవర్ చుట్టూ ఉన్నవారి మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి అనే విషయం. అలాగే ఎక్కువ రేడియేషన్ విడుదల చేసే తక్కువ ధర కలిగిన మొబైల్ ఫీచర్ ఫోన్లతో కూడా ప్రమాదమే అని తెలియజేస్తూ ఉండడం సమాజంలో వ్యాప్తి చెందింది. ఆ ఆలోచనలో సమాజం ఉండగానే…

మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ గా రూపాంతరం చెందింది, స్మార్ట్ ఫోనుగా రూపాంతరం చెందిన స్మార్ట్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని ఆకర్షిస్తే, స్మార్ట్ ఫోన్ సదుపాయాలలో ప్రధానమైన తాకేతెర, దీనివలన కూడా కొన్ని సమస్యలు ఉంటాయని భావన సమాజంలో బలపడుతూ ఉండగా… సాంకేతికంగా జ్ఞానం కలిగినవారు మాత్రమే ఉపయోగించగలిగే స్మార్ట్ ఫోన్ అందరికి అందుబాటులో ఉండే విధంగా మారింది.

Must Know About Your Installed Mobile App Access Features Of Smartphone

మొబైల్ రేడియేషన్, సదుపాయాలతో ఉండే సమస్యలు ఆరోగ్యం పై చూపితే, అవి వ్యక్తి యొక్క ఆరోగ్య బలాన్ని బట్టి కాలం గడిచే కొలది భవిష్యత్తులో బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అంటారు. ఇవ్వన్ని వినియోగదారు తెలిసి తప్పక కానీ తెలియక అవసరం ఉండి, స్మార్ట్ ఫోన్ వినియోగాదారుగా మారుతున్నారు.

పాతగా చెప్పబడిన స్మార్ట్ ఫోన్ సమస్యలు కొత్త సాంకేతికత కప్పేస్తే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన కొత్తగా ఏమి లేవా అంటే ఉన్నాయని అంటారు నిపుణులు. అలా ఇప్పుడు కొత్తగా చెప్పబడుతున్న సమస్య ఏమిటి అంటే, వినియోగదారు వివరాలు సేకరణ, ఇతర సంస్థలకు చేరవేయడం అని చెప్పబడుతున్నది.

ఎలా ఇది అంటే కొన్ని రకాల మొబైల్ ఆప్స్ కనబడకుండా మొబైల్ స్క్రీన్ షాట్ తీసి, ఆన్ లైన్లోకి తీసుకోగల చేయగల సమర్ధత కలవు, అనేది పరిశీలన చేసే నిపుణుల అభిప్రాయంగా చెప్పబడుతున్నది. చిత్రం ఏమిటంటే, విచిత్రంగా పనిచేసే సాంకేతిక పరికరం కనిపెట్టింది పరిశోదకుడే, ఆ సాంకేతిక పరికరంలో సమస్యలు మానవ మనుగడకు భవిష్యత్తులో భాదాకరం అని చెప్పేది పరిశోదకులే.

SmartphoneAppInstallationTimeMustObserveHowmanyPersmissionsToMobileAppInstall
పైన ఇవ్వబడిన లిస్టులో ఉన్న స్మార్ట్ ఫోన్ సదుపాయాలపై అనుమతి వలన ఆ సదుపాయాలను ఉపయోగించే శక్తి ఈ ఆప్ కలిగి ఉంటుంది.

రహస్యంగా వినియోగదారు వివరాలు సేకరించే మొబైల్ ఆప్స్ గుర్తించడం ఎలా అంటే ఒకటే మార్గం మీరు ప్లే స్టోర్లో మొబైల్ ఆప్ ఇన్స్టాల్ పేజిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్టాల్ అని ఆకుపచ్చ (Green color) రంగులో  ఉండే బటన్ టచ్/క్లిక్ చేసినప్పుడు మొబైల్ ఆప్ కొన్ని అనుమతులు అడుగుతుంది. అలా అనుమతులు అడిగిన లిస్టులో ఏఏ సదుపాయాలపై అనుమతులు కోరుతుంది అనే విషయం గమనిస్తే, మీకు అవగాహనా వచ్చే అవకాశం ఉంటుంది. ప్లే స్టోర్ నుండి ఆప్ ఇన్స్టాల్ చేసుకునే పద్దతిని ఇంతకుముందు ఒక పోస్టులో వివరించడం జరిగింది ఆ పోస్టు చదివితే మీకు కొంచెం అవగాహనా ఉండే అవకాశం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి ముందుగానే తెలుస్తాయి. ఉదా: కుడి ప్రక్కన ఉన్న చిత్రం చుడండి. b బాణం గుర్తు సూచించేది మొబైల్ ఆప్ పేరు అయితే a బాణం గుర్తు సూచించేది ఆ మొబైల్ ఆప్ అడుగుతున్నా అనుమతుల లిస్టు క్రిందగా ఉన్నాయి. మీరు క్రింద ఆకుపచ్చ రంగు(గ్రీన్ కలర్)లో బటన్ ACCEPT అనే ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. మీరు ఆ ఆకుపచ్చ్ బటన్ టచ్ చేస్తే మీరు ఆ లిస్టులో ఉన్న సదుపాయాలలో  మీ స్మార్ట్ ఫోన్ పై మీరు అనుమతులు ఆ మొబైల్ ఆప్ కి ఇచ్చినట్టే. ఇక ఆ మొబైల్ ఆప్ ఆ లిస్టులో ఉన్న స్మార్ట్ ఫోన్ సదుపాయాలను ఉపయోగించే సామర్ధ్యం ఉంటుంది.

Must Know About Your Installed Mobile App Access Features Of Smartphone

అయితే ఇలా మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు గమనించే లిస్టుకి, మీరు ఇన్స్టాల్ చేస్తున్న ఆప్ ఉపయోగం ఎంతవరకు అనేది ఆలోచన చేస్తే మీకు ఒక అవగాహనా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదా: ఫోటో ఎడిటర్ మొబైల్ ఆప్ మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయదలిస్తే, ఆ ఫోటో ఎడిటర్ మొబైల్ ఆప్ ఉపయోగం మనకి ఎంతవరకు అని చూస్తే…

ఫోటోలను కట్ చేయడం లేకపోతే టెక్స్ట్ వ్రాయడం లాంటి పనులు ఉంటాయి. అప్పుడు ఆ ఆప్ అవసరమైన స్మార్ట్ ఫోన్ సదుపాయాలు ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆప్ ఎక్కువ అవసరం గేలరీ, మై ఫైల్స్, స్టోరేజ్, కెమెరా అంతవరకే అవసరం అవుతాయి. అటువంటి మొబైల్ ఆప్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ సదుపాయాలపై అనుమతులు అడిగింది అంటే అది ఎంతవరకు ఉపయోగం ఆలోచన చేయాలి.

మానసిక పరివర్తన సలహాలు మొబైల్ ఆప్స్ గురించి చూడండి

ఆన్ లైన్ డాక్టర్ కన్సల్ట్ మొబైల్ ఆప్స్ చూడండి

ఎడిట్ చేసిన ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసే మొబైల్ ఆప్స్ ఇంకా ఎక్కువ అనుమతులు అడుగుతుంది. అయితే ఇలా ఒక నిర్దిష్ట పనికి ఒక కచ్చితమైన మొబైల్ ఆప్ ఎంచుకోవడం మంచిది. అనేక పనులు ఒక మొబైల్ ఆప్ ద్వారా నిర్వహించాలని చూస్తే, సదరు మొబైల్ ఆప్ ఎక్కువ అనుమతులు కోరుతుంది. ఎక్కువ అనుమతులు అంటే, దాదాపు ఫోనుపై అనుమతి ఆ మొబైల్ ఆప్ కి అప్పజెప్పినట్ట్టే.

ఒక పనివాడిని ఒక విషయంలో వాడడం వలన అతను ఎక్కువ కాలం అదే పనిలో ఉండగలడు, అలాగే ఎక్కువపనులు ఒకే పనివాడికి చెబుతున్నాం అంటే, ఆ పనివాడిపై యజమాని ఆధారపడినట్టు అవుతుంది. కొన్నాళ్ళకు ఆ పనివాడి మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక చిన్నపనికి ఎక్కువ సదుపాయాలు కలిగిన మొబైల్ ఆప్ అనవసరం.

Must Know About Your Installed Mobile App Access Features Of Smartphone

ఫోటో ఎడిట్ చేయడం వరకు మొబైల్ ఆప్ ఉపయోగించి, తరువాయి సోషల్ మీడియాలో ఆ ఎడిట్ చేసినా ఫోటోని గేలరీ నుండి షేర్ చేయవచ్చు. అంతేకాని వెంటనే తేలికగా పని అయిపోతుంది కదా అని ఫోటో ఎడిట్ చేయడానికి, పేస్ బుక్ షేర్ చేయడానికి బ్లూటూత్ ద్వారా షేర్ చేయడానికి ఒక ఫోటో ఎడిట్ మొబైల్ ఆప్ ద్వారానే చేస్తే ఆ ఆప్ అనుమతులు మీ మొబైల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది.

గేలరీ ఉన్నది ఎందుకు ? ఫోటోలు చూడడానికి, అవి షేర్ చేయాలంటే షేర్ చేయడానికి కాబట్టి గేలరీ మొబైల్ ఆప్ మీ ఫోన్లో ఉంటే, ఫోటోలు ఎడిట్ చేయడానికి కేవలం ఎడిటింగ్ సదుపాయాలు ఉన్న మొబైల్ ఆప్ ఎంచుకోవడం ఉత్తమం. ఈ విధంగా మ్యూజిక్/సాంగ్ కట్టర్, వీడియో ఎడిటర్/ కాల్ రికార్డర్ / వాయిస్ రికార్డర్ మొదలైన మొబైల్ ఆప్స్ ఏ పనికి ఆ బేసిక్ సదుపాయాల మొబైల్ ఆప్ సాదారణంగా మొబైల్ తయారుదారు సూచించిన ఆప్స్ వాడుకుంటూ, లేని పక్షంలో ఇతర మొబైల్ ఆప్స్ అనుమతులు తక్కువగా సదరు పనికి సంభందించిన అనుమతులు అడిగే మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ఉత్తమైన పని.

Must Know About Your Installed Mobile App Access Features Of Smartphone

సాదారణ వస్తువు ఎంతవరకు ఉపయోగమో అంతవరకే ఉపయోగిస్తాం, అలాగే మొబైల్ ఆప్ పని ఏమిటి అది కోరే అనుమతులు ఏమిటి, ఆ పని మనం మన స్మార్ట్ ఫోన్లో ఎక్కువగా ఉపయోగిస్తామా లేదా అనేది చూసుకుని వాడుకుంటే ఉపయోగం ఎక్కువ అపాయం తక్కువ ఉండవచ్చు.

అనవసరంగా ఆన్ లైన్లో ఉండడం, ఎప్పుడు మొబైల్ డేటా ఆన్లో ఉంచడం, ఎక్కువగా ఆన్ లైన్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏ ఏ లింకులపై టచ్ చేస్తున్నామో గ్రహించక పోవడం లాంటి పొరపాట్లు కూడా స్మార్ట్ ఫోన్ పనితీరుకి నష్టం జరిగే అవకాశంతో పాటు వివరాలు సేకరించే మొబైల్ ఆప్ ఉంటే వాటికీ సహాయపడినట్టు అవుతుంది.

అసలు ఒకసారి మీ ఫోన్లో ఉన్న బేసిక్ మొబైల్ ఆప్స్ ఏమిటి ? కొత్తగా డౌన్ లోడ్ చేసినవి ఏమిటి ? ఏఏ మొబైల్ ఆప్స్ ద్వారా ఎంత ఉపయోగం? ఎన్ని మొబైల్ ఆప్స్ ఉపయోగించకుండా ఉన్నాయి ? ఎప్పుడైనా గమనించారా ?

దొంగ ఒకసారి ఒకఊళ్ళో దొంగతనం చేసినప్పుడు సులభంగా దొంగతనం చేయగలిగితే మరలా అదే ఊరిలో దొంగతనం చేస్తాడు. మరలా అతని పని సులభం అయితే మరలా మరలా ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ ఊర్లో జాగ్రత్తలు అంత తక్కువగా ఉన్నట్టు. అలాగే స్మార్ట్ ఫోన్ ఆప్స్ విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే, ఇప్పుడు కేవలం వివరాలు తెలుసుకోగలిగిన వారు ఇంకా మరింత వ్యక్తిగత వివరాలు సేకరించగలరు.

కొన్ని వైరస్ డిటెక్షన్ మొబైల్ ఆప్స్ ఉపయోగించడం వలన డేటా చోరి చేసే మొబైల్ ఆప్స్, గేమ్స్ ఏమిటో తెలుసుకోవచ్చు. అయితే ఎక్కువగా మీకు అవగాహనా ఉండడం మంచిది అని మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసుకోవడం విషయం ప్రస్తావించాను.

ధన్యవాదాలు.
vega2020 – view enlisted gadget apps and games

 

bpr