Wednesday, October 17, 2018
Home > View Enlisted Gadget Apps > Needed thing Read Reviews Latest Smartphone Selection

Needed thing Read Reviews Latest Smartphone Selection

Needed thing Read Reviews Latest Smartphone Selection

Needed thing Read Reviews Latest Smartphone Selection ? in Telugu :స్మార్ట్ ఫోన్ సహాయంతో కొన్ని పనులు సులభంగా చేసుకోవడం, కొందరికి సమాచారం సులభంగా పంపగలగడం, కొన్ని విషయాలు సులభంగా నేర్చుకోవడం, నేర్పడం, కొంతమంది సంపాదించడం, వీడియో ప్రసారాలు, వీడియో వీక్షణలు ఇలా సాదారణ జీవితంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువ. ఆన్ లైన్ వ్యవహారాలు కూడా ఎప్పుడైనా నిర్వహించుకునే అవకాశం, ఎప్పుడైనా స్నేహితులతో చాటింగ్, ఎప్పుడైనా entertain వీడియోస్ లభించడం, స్మార్ట్ ఫోన్ వాడుక ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాడుతున్న వస్తువు పనితీరు తక్కువ కాలంలో మారుతుంటుంది. కొంతమంది జాగ్రత్తగా వాడుతారు, కానీ ఫోను కొత్తగా ఉన్న కొన్నాళ్ళకు టెక్నాలజీ పాతది అయిపోతుంది.

ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనే వారు పెరిగారు, పాత ఫోన్లు అమ్మేవారు కూడా ఉన్నారు. కొన్ని ఇకామర్స్ వెబ్ సైట్లలో కొత్త పాత స్మార్ట్ ఫోన్లు అమ్మకాలు జరుగుతాయి. కొత్త ఫోన్లు కొనే వారు రివ్యూలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. కొన్ని వెబ్ సైట్ల స్మార్ట్ ఫోన్లపై, వారి సదుపాయాలు, వివరణలు ఇస్తూ ఉంటారు. తినే ముందు రుచి అడగడం ఎందుకు అని, కొనే ముందు రివ్యూలు చదవకపోతే, కొన్న ఫోన్ పూర్తిగా కొత్తగా వచ్చిన మోడల్స్ విషయంలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నాణ్యత లోపం లేక ఫీచర్స్లో నాణ్యత లోపం వలన కొన్న్ని మోడల్స్ ఫెయిల్ అవుతాయి. కొన్ని ఫోన్లలో ఒక్కోసారి హీట్ ఎక్కుతా ఉంటాయి, డిస్ప్లే వ్యూ సరిగా ఉండకపోవచ్చు, బాటరీ తొందరగా డిశ్చార్జ్ అవ్వడం, హాంగ్ అవ్వడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చిన మోడల్స్ పై అవగాహన మనకి తెలిసిన వారిలో ఆ ఫోను వాడినవారు లేకపోవడం వలన ఫోను నాణ్యత విషయాలు తెలియవు. అదే పాపులర్ అయిన మోడల్ గురించి అయితే అన్ని, అవగాహన ఉన్నవారు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.



కొత్తగా వచ్చిన మోడల్స్ విషయంలో తెలిసిన వారి అభిప్రాయం లభించడం కన్నా, నిపుణుల అభిప్రాయాలు లేక నాణ్యత మరియు స్మార్ట్ ఫోన్ సదుపాయాల గురించి వివరించే సంస్థల న్యూస్ అప్డేట్స్ తొందరగా అందుతాయి. స్మార్ట్ ఫోన్ తొందరగా వేడెక్కడం, లేకపోతె హాంగ్, బాటరీ బ్యాక్ అప్ సరిగా లేకపోవడం అనేవి స్మార్ట్ ఫోన్ వాడకానికి ఇబ్బందికరం. ఇంకా ఆ తరువాత a ఫోను సదుపాయాలు చూడవచ్చు.

ఫోన్ హాంగ్ కాకుండా ఉండాలి, స్టోరేజ్ నోటిఫికేషన్లు రాకూడదు, కెమెరా క్వాలిటీ బాగుండాలి, బాటరీ బ్యాక్ అప్ ఎక్కువ సమయం రావాలి, డిస్ప్లే రిజల్యుషన్ బాగుండాలి ఇలా మార్కెట్లో లేటెస్ట్ సదుపాయాలతో కలిగి ఉన్న ఫోను, దానికి ఉన్న అన్ని సదుపాయాలలో పనితీరు రేటింగ్ ఎలా ఉంటుంది, లేక వాడిన కొత్త వినియోగదారు అభిప్రాయాలు తెలిపే వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. ఇంకా ఇలా వెబ్ సైట్లలో లేటెస్ట్ ఫోను గురించి వివరాలు, తెలుసుకోవడానికి చూస్తే, రాబోయే ఫోన్ల సదుపాయాలు గురించి కూడా తెలుస్తాయి.

ఇలా రివ్యూ అందించే వెబ్ సైట్ మరియు మొబైల్ అప్స్ కొన్నింటిని గురించి, ఇంతకుముందు పోస్టులలో వివరణ చదవడానికి క్రింది లింకులపై క్లిక్ / టచ్ చేయండి

Better Mobile Selection – 91 Mobile Application

Genuine user Reviews Website – Mobile Application

New Smartphones

మరిన్ని వివరాలు తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

bpr