0 Comments

PuriJagannath Temple Radhayatra Mobile Apps

PuriJagannath Temple Radhayatra Mobile Apps జగమెరిగిన జగన్నాధుడు జగమేలిక అయిన పూరి జగన్నాధుడి రధయాత్ర జగత్ప్రసిద్ది. ప్రతి సంవత్సరం ఆషాడం మాసంలో ప్రారంబమమయ్యే రధయాత్ర ఉత్సవం మహోత్సవంగా జరిపించుకోవడం జగన్నాధుడి లీల. దేశనలుమూలల నుండే అశేష భక్తజనం జగన్నాధుడిని దర్శించుకోవడానికి పూరి వస్తారు. ముఖ్యంగా రధయాత్ర మహోత్సవం Radhayatra Festival చూడడానికి వస్తూ ఉంటారు.

ఒడిస్సా రాష్ట్రంలో కల పూరి జగన్నాధ్ దేవాలయం, PuriJagannath Temple జగత్ ప్రభవు కొలువు ఉండే దేవాలయంగా భక్తజనం భావిస్తారు. బంగాళాఖాతా సముద్ర తీరాన గల గుడిలో జగత్ ప్రభువుగా విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సహితంగా దర్శనం ఇస్తూ ఉంటారు. చార్ థాం పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాధ్ దేవాలయం ఒక క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది.

ప్రతి యేట ఆషాడ మాసంలో జరిగే జగన్నాధ రధయాత్రలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల దేవతలు రధంపై ఊరేగుతారు. తెలుగు ఆషాడ మాసం ఇంగ్లీష్ క్యాలెండరు ప్రకారం జూన్ లేక జూలై నెలల్లో వస్తూ ఉంటుంది, అంటే రధయాత్ర కూడా జూన్-జూలై నెలల్లో ప్రతి సంవత్సరం ప్రత్యేక తిథుల్లో నిర్వహిస్తూ ఉంటారు.

పూరిజగన్నాధ్ దేవాలయం జగన్నాథుడు రధయాత్ర ఈ సంవత్సరం ఆషాడ మాసం అనగా జూలై 14 తేదిన రధోత్సవం నిర్వహిస్తారు. అశేష భక్తజనం పాల్గొనే ఈ జగన్నాధుడి రధయాత్ర కన్నులపండుగగా కనబడుతుంది. అనేక టివి చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటారు. అలాగే ఈ స్వామి దేవాలయంలో రధయాత్రతో పాటు మరికొన్ని పండుగలు నిర్వహిస్తారు. చందన యాత్ర, స్నానయాత్ర, శయనఏకాదశి, దక్షిణాయన సంక్రాంతి, పార్శ్వ పరివర్తన ఏకాదశి, దేవా ఉత్తాన ఏకాదశి, డోల యాత్ర, దమనక చతుర్ధశి, మకరసంక్రాంతి, పుస్యాభిసేక, నీలాద్రిమహోదయ పండుగలు ప్రతియేటా ప్రత్యేక తిథి, మాసాలను అనుసరించి చేస్తూ ఉంటారు.

భువనేశ్వర్లో బిజుపట్నాయక్ విమానాశ్రయానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే పూరిజగన్నాథ్ రధయాత్ర ప్రముఖమైనది, జగత్కళ్యాణం కోసం అవతరించిన శ్రీకృష్ణభగవానుడి రధయాత్రను చూడడం జన్మజన్మలో అదృష్టంగా చెబుతారు. PuriJagannath Radhayatra పూరిజగన్నాథ్ రధయాత్ర వీక్షించడానికి అశేష భక్తుల జనులు బస్సు యాత్ర, రైలు యాత్ర చేస్తూ పూరి వచ్చి వీక్షిస్తారు.

PuriJagannath Temple Radhayatra Mobile Apps

ఈరోజు జరుగు జగన్నాధుడి రధయాత్రలో పాల్గొనే జగతిలోని జనం జనసముద్రంలా తలపిస్తారు. చూడడానికి జగతి నలుమూలల జనులు వివిధ రకాల వాహనయాత్ర చేసి జగన్నాధుడి రధయాత్రలో పాల్గొనే విశేషం టివిలలో వీక్షించే వారికి కన్నులపండువగా ఉంటుంది. మనకి మొబైల్ ఆప్స్ వివిధ విషయాలలో అనేకం లభిస్తున్నట్టే, పూరి దేవాలయం, పూరి దేవాయల విశిష్టత PuriJagannath Temple Special, పూరి జగన్నాధ్ రధయాత్ర విశేషాలు తెలిపే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పూరి ప్రసిద్ద పట్టణ మాప్స్, వాతారణం, రవాణా మార్గాలు, రెస్టారెంట్స్, హోటల్స్ వివరాలు తెలియజేసే మొబైల్ ఆప్స్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్రింది చిత్రాలకు కొన్ని పూరి క్షేత్రంపై లభించే మొబైల్ ఆప్స్ లింక్ చేయబడి ఉన్నాయి, సదరు లింకుపై టచ్/క్లిక్ చేసి మొబైల్ ఆప్ అనుమతుల వివరాలు పరిశీలించి స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Following PuriJagannath Temple Radhayatra Mobile Apps

PuriJagannath Temple Radhayatra Mobile Apps

PuriJagannath Hindu Temple Android Mobile App

Puri Temple Hinduism Wallpaper Radhayatra Mobile Apps

Puri Temple Hinduism Wallpaper Mobile App

MyCity PuriJagannath Temple Radhayatra Mobile Apps

MyCity PuriJagannath Temple Mobile App

Tourist Attractions Puri Temple Radhayatra Mobile Apps

Tourist Attractions Puri
Temple Mobile App

Puri Police PuriJagannath Temple Radhayatra Mobile Apps

Puri District Police launches its official mobile app

MyCity PuriJagannath Rath Yatra Photo Frames Mobile Apps

Rath Yatra Photo Frames
Android Mobile Apps

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

Tags: , , , ,