Friday, November 16, 2018
Home > View Enlisted Gadget Apps > Some National & Regional Political Parties Website List India

Some National & Regional Political Parties Website List India

Indian political parties list 10 pranteeya rajakeeya partila vivaralu bharat desham

Some National & Regional Political Parties Website List India.

“Some National & regional political parties website list India” in Telugu : భిన్నమత సంస్కృతులతో భిన్న ఆచారాలు కలిగి వివిధ కులాలతో కలిగిన అనేక ప్రాంతాలలో నివసించే ప్రజలు కలిగిన దేశం మనదేశం. పల్లె సంస్కృతి మరియు పట్టణ ఆధునిక జీవన విధానం రెండూ కనిపించే అద్బుత ప్రదేశాలు కలిగిన దేశం మనదేశం. ప్రాంతాలవారిగా అనేక జీవన పద్దతులు మరియు వివిధ ప్రాంతీయ భాషలు మాట్లడే ప్రజలు నివసించే దేశం మనదేశం. కులపరంగా ఎవరి జీవనవిధానం వారు కొనసాగిస్తూ, ఇతర కులాల సంస్కృతిని కూడా గౌరవించే దేశం మనదేశం.

నేను ఈ ఇంటిలో పుట్టాను, ఇప్పటికే ఈ ఇంటికి, ఇంటిపెద్దకు ఉన్న మంచిపేరు చెడగొట్టకుండా, ఇంకా మంచిపేరు తెచ్చేవిధంగా బ్రతకాలి అనే గొప్ప కుటుంబ ఆచారవిధానం వ్యక్తులు అలవరుచుకునే దేశం మనదేశం. నాది ఈ కులం నా ప్రవర్తన నా కుటుంబ ఆచార సాంప్రదాయ విధానం వలన నా కులం యొక్క గొప్పతనం ఇమిడి ఉంది, అని ఎప్పుడూ తానూ ధర్మం పాటిస్తూ, తన పిల్లలను మంచిమార్గంలో నడిపించే పెద్దరికాన్నికుటుంబసంప్రదాయంగా ఏర్పరచి, కుటుంబ గౌరవం పెంచిన దేశం మనదేశం. మనమతం మంచితనం ఇతరసంప్రదాయం ప్రచారం చేసుకున్నా, ఆ ప్రచారంలో మంచి విషయం ఉంటే, అంగీకరించే గొప్ప సమాజాన్ని ఏర్పరచిన దేశం మనదేశం. మనిషి ధర్మం పాటించాలి, ప్రకృతిని దైవంగా భావిస్తూ ప్రకృతితో ప్రేమను పెంచుకున్న దేశం మనదేశం. కులమతాలు మనిషి ఎదుగుదలకు అడ్డుకాదు, అవి వ్యక్తి పరమపద సోపానానికి మార్గాలు, తన కష్టమే తన ఎదుగుదలను పెంచుతుందని నమ్మిన వ్యక్తులతో నిండిన దేశం మనదేశం.



మన భారతదేశ సమాజంలో ఉన్నజాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీలు వెబ్ సైట్లు (Some National & Regional Political Parties Website List in India) వివరాలు చూస్తే !

అటువంటి మనదేశం మహారాజులు, రాజుల, రాణుల పరిపాలన నుండి, ప్రజలే పరిపాలించుకునే ప్రజాస్వామ్య పరిపాలనలో కొనసాగుతుంది. ఆధునిక సంస్కృతితో కలిసి కాలంలో వేగంగా పరిగెత్తే సమాజంలో అనేక రాజకీయ పార్టీలు (Political Parties) ప్రజాస్వామ్య పద్దతిలో పోటిచేస్తూ, గెలుస్తూ పరిపాలన సాగిస్తున్నాయి. మన ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలు (Political Parties), రాజకీయనాయుకులు(Political leaders) అనేకమంది, దేశ నాయుకులు కొంతమంది ఉంటే, ప్రాంతీయ నాయుకులు(Local Leaders) అనేకమంది. అలాగే పార్టీలవారిగా కొందరు రాజకీయప్రముఖులు(Political Professions) ఉంటే, చిన్నచిన్న ప్రాంతాలలో, ఆ ప్రాంతీయ నాయుకులు(Local Leaders) రాజకీయాలలో (Politics) కీలక పాత్రను పోషిస్తూ ఉంటారు. పార్టీల అధికారం మారుతూ ఉంటుంది.

మనదేశంలో జాతీయ రాజకీయ పార్టీలు (National Political Parties), ప్రాంతీయ రాజకీయపార్టీలు(Regional Political Parties) కలవు. జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం పొందితే, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో అధికారం కలిగి ఆయా పార్టీ నాయుకులు పరిపాలన చేస్తూ ఉంటారు. అలా అధికార అనధికార రాజకీయ పార్టీల అధికార వెబ్ సైట్ లేక మొబైల్ ఆప్స్ ఏమిటో చుస్తే !

స్వాతంత్ర్యం పోరాట సమయంలో ఏర్పడి, స్వాతంత్ర్యం వచ్చాక రాజకీయపార్టీగా (National Political Party) అవతరించిన పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ (Indian Congress Party). మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అయితే చాలా సంవత్సరాలు కేంద్రంలో అధికారం కొనసాగించిన పార్టీ. ఈ పార్టీ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీగా ఉన్నారు. ఎన్నికల చిహ్నం హస్తం  అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న BJP పార్టీ, స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ జనత పార్టీ బి.జె.పి. (Bharatiya Janata Party)గా ఏర్పడి, ఇప్పుడు గత ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా ఎక్కువ సీట్లు సాధించి, ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ పార్టీకి అధ్యక్షులుగా శ్రీ అమిత్ షా ఉన్నారు. ఎన్నికల చిహ్నం కమలం, అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా రెండూ పార్టీల కలియికగా ఉంది, సిపిఐ (CPI) + సిపిఎం(CPM) లతో ఉంది  వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా కాలం అధికారం కొనసాగించిన రాజకీయపార్టీ. సిపిఐకి శ్రీ సురవరం సుధాకర రెడ్డి, సిపిఎంకి శ్రీ సీతారం ఏచూరి అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికల చిహ్నం సిపిఐ కి కొడవలి సుత్తి ఉంటే, సిపిఎంకు కొడవలి కంకులు గుర్తులుగా ఉన్నాయి. అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగి, తరువాత ఆ పార్టీని వీడి కొత్తగా జాతీయ రాజకీయ పార్టీలు (National Political Party) పెట్టిన ప్రముఖులలో మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ రాజకీయ పార్టీని ఏర్పరిచారు. ఈ పార్టీకి అధ్యక్షులుగా శ్రీ మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. ఆ పార్టీ గుర్తు పువ్వుల గుర్తు అయితే అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

అలాగే ఇంకొక ప్రముఖ కాంగ్రెస్ నాయుకులు శరద్ పవార్, మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, తరువాయి కాలంలో సొంతంగా పార్టీనీ స్థాపించారు. ఇప్పటికి ఆయనే అధ్యక్షులుగా కొనసాగుతున్న పార్టీ పేరు నేషనల్ కాంగ్రెస్ పార్టీ, చిహ్నం గడియారం. ఈ పార్టీ అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

మరొక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి గారు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు. అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

ఇప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాజకీయ పార్టీల వివరాలు చూస్తే ! స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన రాజకీయ ప్రాంతీయ పార్టీ – తెలుగు దేశం పార్టీ, సంపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోటిగా ఉండి ఎక్కువ మార్లు అధికారం చేపట్టిన తెలుగు దేశం ఇప్పుడు తెలంగాణా లేని ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీగా కొనసాగుతుంటే, ప్రస్తుతం శ్రీ చంద్రబాబు నాయుడుగారు అధ్యక్షులుగా మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల చిహ్నం సైకిల్, అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్

YSR కాంగ్రెస్, సంపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, అయన కాలం చేశాక, ఆయన కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారు ఏర్పరిచిన పార్టీ YSR కాంగ్రెస్. ప్రస్తుతం శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు అధ్యక్షులుగా ఉన్న పార్టీ ఎన్నికల చిహ్నం ఫ్యాను, అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

ప్రత్యేక తెలంగాణా మా ప్రాంత హక్కు అంటూ, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ స్పూర్తిగా ఏర్పడిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి. తెలంగాణా ఏర్పడిన తరువాత మొదటిసారి అధికార పార్టీగా తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఉంటే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు పార్టీ అధ్యక్షులుగా శ్రీ కే చంద్ర శేఖర్ రావు కొనసాగుతున్నారు. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం కారు, అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

లోక్ సత్తా ఇది మీ సత్తా అంటూ స్థాపించిన పొలిటికల్ పార్టీ ఇది. ఒక ఐఏఎస్ అధికారి అయిన శ్రీ జయప్రకాశ్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం విజిల్, అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్

జై సమైక్యాంధ్ర సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ విడదీయరాదనే నినాదంతో అప్పటి సమైక్యాంద్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించారు. అలాగే ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలోనే రాయలసీమ పరిరక్షణ సమితిని శ్రీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  పార్టీగా స్థాపించారు.

సమైక్యాంద్ర రెండూ రాష్ట్రాలుగా విడిపోయాక జరుగుతున్నా ఎన్నికలుగా ముందుగా శ్రీ పవన్ కళ్యాణ్ (పవర్ స్టార్) గారు జనసేన పార్టీని స్థాపించి, ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీకి, కేంద్రంలో BJP పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ, ప్రజలలోకి వెళుతున్నారు. అధికారిక వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్.

మొదలైన భారతీయ రాజకీయ జాతీయ ప్రాంతీయ పార్టీలపై ప్లే స్టోర్లో లభిస్తున్నమొబైల్ ఆప్స్ పేజిలను సందర్శించడానికి క్రింది లింకులపై తాకండి / నొక్కండి.

భారతీయ జనతా పార్టీ మరియు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పై గల ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్ కోసం నన్ను తాకండి / నొక్కండి.

కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీ రాహుల్ గాంధీగారిపై లభించే వివిధ ఆండ్రాయిడ్ ఆప్స్ కోసం ఇక్కడ తాకండి / నొక్కండి.

తెలుగుదేశం పార్టీ మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై లభించే వివిధ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కోసం ఇక్కడ తాకండి / నొక్కండి.

YSRCP మరియు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి గురించిన వివిధ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కోసం ఇక్కడ తాకండి / నొక్కండి.

జనసేన పార్టీ మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించిన వివిధ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కోసం ఇక్కడ తాకండి / నొక్కండి.

TRS పార్టీ మరియు KCR గారి గురించిన వివిధ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కోసం ఇక్కడ తాకండి / నొక్కండి.

సిపిఐ సిపిఎం పార్టీలపై గల వివిధ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కోసం ఇక్కడ తాకండి / నొక్కండి.

 

కొన్ని జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీల అధికారిక వెబ్ సైట్ లింకులు క్రింది చిత్రలకు లింకు చేయబడినవి. ఆయ రాజకీయపార్టీల వెబ్ సైట్లను సందర్శించడానికి చిత్రాలను తాకండి / నొక్కండి.

Indian political parties list 10 rajakeeya partila vivaralu bharat desham
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
Indian political parties list 10 rajakeeya partila vivaralu bharat desham
భారతీయ జనతా పార్టీ
Indian political parties list 10 rajakeeya partila vivaralu bharat desham
సిపిఐ అండ్ సిపిఎం పార్టీలు
Indian political parties list 10 rajakeeya partila vivaralu bharat desham
అల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్
Indian political parties list 10 rajakeeya partila vivaralu bharat desham
బహుజన్ సమాజ్ పార్టీ
Indian political parties list 10 rajakeeya partila vivaralu bharat desham
నేషనల్ కాంగ్రెస్ పార్టీ
Indian political parties list 10 rajakeeya partila vivaralu bharat desham
తెలుగు దేశం పార్టీ
Indian political parties list 10 pranteeya rajakeeya partila vivaralu bharat desham
YSR కాంగ్రెస్ పార్టీ
Indian political parties list 10 pranteeya rajakeeya partila vivaralu bharat desham
లోక్ సత్తా పార్టీ
Indian political parties list 10 pranteeya rajakeeya partila vivaralu bharat desham
జనసేన పార్టీ
Indian political parties list 10 pranteeya rajakeeya partila vivaralu bharat desham
TRS పార్టీ

 

bpr