SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps

SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps

SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps సూర్యుని చుట్టూ తిరిగే భూమి, భూమి చుట్టూ తిరిగే చంద్రుడు ఈ భ్రమణ క్రమంలో చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అని సైన్సు ప్రకారం చెబుతారు. గ్రహణసమయంలో చంద్రుడు కనబడడు, అలాగే గ్రహణం భూప్రాంతాలన్నింటిలోను ఉండదు, కొన్ని ప్రాంతాలలో ఉంటూ ఉంటుంది.

అలాగే సైన్సు ప్రకారం భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం సూర్య గ్రహణం అని అంటారు. సూర్యగ్రహణ (Solar Eclipse) సమయంలో కూడా సూర్యుడు పూర్తిగా లేక కొంతమేర కనబడకుండా ఉండడం జరుగుతుంది. అలాగే అన్ని ప్రాంతాలలో ఉండకపోవచ్చు, కొన్ని ప్రాంతాలలో ఆయా కాలాన్ని బట్టి ఉంటుంది.

చంద్రగ్రహణం (LunarEclipse), సూర్యగ్రహణం (SolarEclipse) ఏర్పడినప్పుడు ప్రజలకు చాలా జాగ్రత్తలు తీసుకోమని ప్రాచీనశాస్త్రం ప్రకారం చెబుతూ ఉంటారు. నవీన విజ్ఞాన శాస్త్రంలో కేవలం భూమికి సూర్యుడు కి మద్యలో చంద్రుడు రావడం లేక సూర్యుడుకి చంద్రుడికి మధ్యలో భూమి రావడం వలన సూర్య చంద్రులు (sun & moon )కనబడరని అని అంటారు.



ఋషులు లెక్కలు గట్టి ఎప్పుడూ ఏ మాసంలో ఏ తిథికి సరిగ్గా ఎన్ని గంటలకు వస్తుందో చెప్పే ప్రాచీన శాస్త్రంతో తెలుగు క్యాలెండరు ద్వారా  సంవత్సరానికి ఒకేసారి పండితులు అందిస్తూ ఉంటారు. గ్రహణ సమయాలలో వచ్చే కాంతి కిరణాలలో నిల్వపదార్ధాలను విషపదార్ధాలుగా మార్చే గుణం కలిగి ఉంటాయని, అందువల్ల ఆ సమయంలో పదార్ధాలలో తగు ఔషద గుణాలు గల దర్బలను ఎక్కువకాలం నిల్వ ఉండే పదార్ధాలలో వేసి జాగ్రత్త పడవలసినదిగా పండితులు చెబుతూ ఉంటారు.

అదే విధంగా తినే ఆహార పదార్ధాలు మనిషి కడుపులో ఉంటాయి కాబట్టి, గ్రహణ సమయానికి కొన్ని గంటలకు ముందు నుండే ఆహారం ఏమి తీసుకోవద్దని కూడా పండితులు ప్రాచీన శాస్త్రానుసారం చెబుతారు. అంటే ఆహారం అరగడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం గ్రహణం పట్టే సమయానికి ముందు నుండే ఉపవాసం చేస్తూ ఉంటారు. జీర్ణాశయం ఖాళీగా ఉంచి ఆ సమయంలో అంతర్ముఖులు అవ్వడం లేక భగవధ్యానం చేయడం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని చెబుతారు.

సైన్సు ప్రకారం కూడా గ్రహణ సమయంలో కాంతికిరణాల గుణం సాదారణ గుణం కన్నా ప్రమాదకరమైనదిగా చెబుతారు. అయితే పండితులు ఆ గ్రహణ సమయాన్ని మంచికి ఎలా ఉపయోగించుకోవాలో సూచనలు చేసి ఉంటారు. ఇలా పండితుల / పెద్దల సూచనలు పాటించే వారికి గ్రహణ సమయాలు, గ్రహణ ప్రభావ ప్రదేశాలు తదితర వివరాలను తెలియజేసే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps

స్మార్ట్ ఫోన్ యూజర్ తప్పనిసరిగా ఏదైనా ఐచ్చిక మొబైల్ ఆప్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేస్తున్నప్ప్పుడు సదరు మొబైల్ ఆప్ నియమ నిబందలనలు, మరియు ఆ ఆప్ స్మార్ట్ ఫోన్ సదుపాయాలపై చూపించే ప్రభావం సరి చూసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే ఉపయోగించని మొబైల్ ఆప్స్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని తొలగించడం వలన స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మన్స్ బాగుంటందని నిపుణులు చెబుతూ ఉంటారు.

SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps
Eclipse Calculator 2 Mobile App
SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps
Eclipse Calendar Android Mobile App
SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps
Eclipse View Android Mobile App
SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps
Eclipse Map Android Mobile App
SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps
Lunar Eclipse Android Mobile App
SuryaGrahanam, ChandraGrahanam Android Mobile Apps
Eclipse UI Tips Android Mobile App

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games