Upcoming Smartphones Create Crazy Always Latest

Upcoming Smartphones Create Crazy Always Latest

Upcoming smartphones create crazy always latest updates in online. Read in Telugu మది సాధనాలతో సాధన సాదారణంగా ఉంటే, కొత్త ఎప్పుడు మనస్సుకు మందు అన్నట్టు, ఇష్టం ఎప్పుడు కొత్తవైపు పోతుంది. అటువంటప్పుడు సాదారణ సాధనలు సులభమైతే, సాధారణ సమయాన్ని సంతోష సమయమయితే, కాళీ సమయం విషయ విజ్ఞాన పరిచయమైతే, సందేహానికి సమాధానం లభిస్తే, మార్గమే తెలియనప్పుడు గమ్యం నిర్ణయమైతే, ఇలా మనస్సుకి సాదారణ జీవితం నుండి హటాత్పరిణామం ఒక్కోసారి ఆశ్చర్యం, సంతోషం కలిగితే జీవితమంటే మక్కువ ఎక్కువ అవుతుంది. స్మార్ట్ ఫోను సహచర్యం చేస్తుంది చాలామందితో, బహుశా ఇటువంటి పరిణామాలు కొన్ని కొన్ని కలిగి ఉండడం వలననేమో !

ఒక్కొక్కరికి ఒక్కో విషయముపై మిక్కిలి మక్కువ అంటే మమకారం ఉంటుంది. కొంతమందికి సినిమాలు చూడడం, కొదరికి కామెడీ వీడియోలు, కొందరికి ఆటలు ఆడడం, మరి కొందరికి పాటలు వినడం, ఇంకొందరికి కొత్తవి తెలుసుకోవడం, కొంతమందికి కొత్త వస్తువుల కొనుగోలు, కొంతమంది వస్త్రములపై, కొందరికి టెక్నాలజీ గాడ్జెట్స్ కొనడం ఇలా ఏ విషయంలో మక్కువ ఉంటే, ఆ విషయానికి సంభందించి కొత్తవి వస్తే మదిలో మెదిలేది మక్కువ కలిగించే విషయముపైనే.



కొందరికి నిత్యం అనువర్తనాలతో ఎదో ఒక వ్యాపకముపై వివరాలు అందించే స్మార్ట్ ఫోను అయిన మొబైలుపై మిక్కిలి మక్కువ కలుగుతూ ఉంటుంది. ఇంచుమించు కంప్యూటర్లో చేసే చిన్న పాటి పనులు స్మార్ట్ ఫోన్లో నిర్వహించవచ్చు, అలాగే మదికి ఉల్లాసాన్ని అందించే గానం వినవచ్చు, కనులకు ఇంపుని కలిగించే వీడియో వీక్షణలు, ఏదైనా అప్పటికప్పడు సందేహం ఉంటే, తెలిసినవారిని అడిగినట్టు క్రోమ్ సెర్చ్ లో ఆన్ లైన్లో అడగవచ్చు.  ఇలా సాధారణ సాధనాలకు స్మార్ట్ ఫోను సహాయకారి అయ్యి అందరిని ఆకట్టుకుంటుంది. అటువంటి స్మార్ట్ ఫోన్లు టెక్నాలజీ అభివృద్ధిని అనుసరించి ఎప్పటికప్ప్పుడు అనేక మార్పులు చేసుకుంటూ సమాజంలో దాని స్మార్ట్నెస్ పెంచుకుంటూ ఉంటుంది. ఇక స్మార్ట్ యూజర్స్ అయితే స్మార్ట్ విశేషాలు వీక్షిస్తూ, వేంచేసిన కొత్త మొబైలుపై మక్కువతో పాత మొబైలుని మరొక మక్కువ దారుకి అమ్మకం చేసి, కొత్త మొబైల్ కొంటూ ఉంటారు.

స్మార్ట్ ఫోను గురించి చదవడం కన్నా స్మార్ట్ వ్యూ సులభంగా అనిపిస్తే, యూట్యూబ్లో వీక్షించడానికి వీడియోలు లభిస్తాయి. వాటిలో “Top 10 Upcoming Smartphones 2018” వీడియో దాదాపు 2.5 మిలియన్ వీక్షకులు వీక్షించారు (అంటే 2500000ల మంది యూట్యూబులో చూసారు). అలాగే మరి కొన్ని వీడియోలు ” My Best Smartphone Picks Under 15,000(2018)” 1.1 మిలియన్ వీక్షణలు కలిగి ఉంటే, మరొక వీడియో “Top 10 Best smartphone to buy in 2018! you should buy!” 1.3 మిలియన్ వీక్షణలు కలిగి ఉంది. ఇంకా టెక్ విషయంలో “How to film + edit on your smartphone | TECH TALK” 2.9 మిలియన్ వీక్షణలు కలిగి ఉంది.

సాధారణంలో స్మార్ట్ ఫోను సహాయంతో కొత్త స్మార్ట్ ఫోను విషయాలు తెలిపే అప్స్ మదిలో మరింత ఉత్సుకతను పెంచుతాయి. మరి మదిని మురిపించే స్మార్ట్ సహవాసి స్మార్ట్ మొబైల్ కొత్తగా వచ్చే వాటి గురించి చూస్తే, 91మొబైల్స్ వారి విశేషాల ఆధారంగా క్రింది కొత్త ఫోన్ల వివరాలు ఉంటాయి.

ముందుగా మోటో నుండి ఇంతకుముందు వచ్చిన జి సిరీస్ స్మార్ట్ ఫోన్లు, మధ్యతరగతి స్మార్ట్ యూజర్లను బాగానే అలరించిందని చెబుతారు. ఇప్పుడు మోటో నుండి  జి6 / జి6 ప్లే కొత్త స్మార్ట్ ఫోన్లు, Xiaomi Redmi S2 / Y2, Redmi 5 Plus స్మార్ట్ ఫోన్లు, ఇంకా Asus ZenFone 5, LG G7 ThinQ, Samsung నుండి గాలక్సీ J4,  గాలక్సీ J8, నోకియా 2.1, 3.1 నుండి త్వరలో విడుదల అవుతున్నాయని వార్తల వివరాలు మనకి 91 మొబైల్స్ అప్ లో కానీ వెబ్ సైట్లో కానీ చూడవచ్చు.

Upcoming Smartphones Create Crazy Always Latest
Nokia X
Upcoming Smartphones Create Crazy Always Latest
Samsung J8 2018
Upcoming Smartphones Create Crazy Always Latest
Asus ZenFone
Upcoming Smartphones Create Crazy Always Latest
Xiaomi Redmi Y2
Upcoming Smartphones Create Crazy Always Latest
Moto G6 Plus
Upcoming Smartphones Create Crazy Always Latest
Samsung Galaxy J4
Upcoming Smartphones Create Crazy Always Latest
Xiaomi MI A2

 

 

 

 

 

 

 

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Android phones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *