Wednesday, October 17, 2018
Home > View Enlisted Gadget Apps > Youtube Smartphone Smart Video Viewing Android App

Youtube Smartphone Smart Video Viewing Android App

Youtube Smartphone Smart Video Viewing Android App

Youtube Smartphone Smart Video Viewing Android App
యూట్యూబ్

Youtube Smartphone Smart Video Viewing Android App in Telugu: యూట్యూబ్ స్మార్ట్ ఫోను స్మార్ట్ వీడియో వ్యూయింగ్ అప్లికేషను, ఇది డిఫాల్ట్ గా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. కొత్తగా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయనవసరం లేదు కానీ అప్డేట్సు ఉంటే, అప్ అప్డేట్ చేసుకోవాలి.  ఎప్పుడైనా ఎక్కడైనా వివిధ రకాల విషయలపై వీడియో వీక్షణ కలిపించే మొబైల్ అప్.

ఏదైనా నేర్చుకోఅవడం అంటే, వాటిని నేర్పించే చోటకి వెళ్ళాలి.  అవి అందరికి అందుబాటు దూరంలో ఉండకపోవచ్చు. కొందరికి మరీ దూరం ఉండవచ్చు, మరి కొందరికి దగ్గరే, విద్యా సంస్థ ఉన్నా, వారికీ అవసరమైన కోర్స్, ఆ సంస్థలో లభించకపోవచ్చు.  అయితే ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చాక, దూరం దగ్గరై, అన్ని అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువ అయినాయి.  ఇంట్లో కంప్యూటర్ / లాప్ టాప్, ట్యాబు వంటి స్మార్ట్ డివైస్ ఉండి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, ఇంటివద్ద నుండే కొన్ని కోర్సులు అభ్యసించే అవకాశాలు ఉన్నాయి. అలా అందించే సంస్థల వారు వీడియోలు, లేక వారి ఆన్ లైన్ సేవల వివరాలు తెలిపే మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో లభిస్తాయి.



కొన్ని సంస్థలు అందించే కోర్సులలో పాఠాలుపై ముందుగా తయారుచేసిన వీడియోలు చూసి నేర్చుకోవచ్చు. కొన్ని ఆన్ లైన్ ప్రత్యక్ష్య ప్రసారలలో పాఠాలు నేర్చుకోవచ్చు. ముందుగా తయారు చేసిన వీడియోలు, పాఠంపై పార్టు వీడియోలుగా లభిస్తుంటాయి. అయితే వీటిలో కేవలం వీడియో చూసి నేర్చుకోవాలి, అదే పైడ్ వీడియోలు కానీ ప్రత్యక్ష పాఠాలతో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలలో, సందేహాలు మొదలైన వాటిపై వారి మద్దతు ఉంటుంది. యూ ట్యూబులో లభించే ఉచిత వీడియోలు కొన్ని సంస్థలు వారు అప్డేట్ చేసినవి ఉంటే, మరిన్ని వ్యక్తిగత ఔత్సాహికులు అప్డేట్ చేసినవి ఉంటాయి. యూ ట్యూబులో అప్డేట్ చేసిన వీడియోలు చాలావరకు ఉచితంగానే లభిస్తాయి.

కేవలం సినిమాలు, ఫన్నీ వీడియోస్, లైవ్ చానల్స్, టీవీ ప్రోగ్రామ్స్, పాపులర్ వీడియోస్ ఇలాంటి వీడియోలు మాత్రమే కాకుండా, సందేహాలు, సమాధానాలు, వివరణలు ఇచ్చే వీడియోలను యూ ట్యూబులో లభిస్తున్నాయి. వెబ్ సైట్ మరియు మొబైల్ అప్ రూపంలో అందరికి అందుబాటులో ఉండి, అలరిస్తున్న మొబైల్ అప్ యూ ట్యూబ్.

విషయాలు వివరణలు వీడియోలుగా అందించే యూట్యూబ్ మొబైల్ ఆప్

ఏదైనా విషయముపై బ్లాగులో నుండి తెలుసుకోవాలంటే, వారికీ ఆ బాష అక్షర జ్ఞానం అవసరం, కానీ వీడియో అయితే, వినే విషయముపై సరైన అవగాహన ఉంటే సరిపోతుంది. వరాల పెట్టె నుండి కావాల్సిన వస్తువు తీసుకున్నట్టు, యూట్యూబ్ ఎవరికీ ఏది అవసరమో అది చూసి ఆనందించవచ్చు, నేర్చుకోవచ్చు, తెలియనవి తెలుసుకోవచ్చు. టీవీ సీరియల్ మిస్ అయితే, అదే సీరియల్ వీడియో యూట్యూబులో తర్వాతి రోజున వీక్షించవచ్చు.

ఏదైనా ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ హైలైట్స్ గురించి ప్రత్యెక వీడియోలు యూట్యూబులో హడావుడి చేస్తుంటాయి. ఇంతకముందు ఏదైనా సినిమా విడుదల అయితే, దాని గురించి రివ్యూ వెబ్ సైట్ లేక బ్లాగులలో వ్రాసేవారు, ఇప్పుడు బ్లాగ్గింగుతో పాటు, వీడియోలు యూట్యూబులో అప్లోడ్  అవుతూ ఉంటాయి. ఏదైనా గాసిప్ లేక పాపులర్ విషయం జరిగితే, ఆ విషయానికి సంభందించి అనేక వీడియోలు యూట్యూబు వీక్షకుల ముందుకు వచ్చేస్తుంటాయి.

ఉదా: రంగస్థలం సినిమా పాటలు విడుదల అయినప్పుడు రంగమ్మా…మంగమ్మా ఏం చెప్పను అనే పాట బాగా ప్రాచుర్యం పొందితే, ఆ పాటపై చిత్రీకరించిన వీడియో పాటలు అనేకం యూట్యూబులో వచ్చాయి.  న్యూస్ ఛానల్ వారు ఏదైనా విషయముపై వివరణ ఇచ్చే ప్రోగ్రామ్స్ చేసినట్టు, కొన్ని యూట్యూబ్ చానల్స్ వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే న్యూస్ ఛానల్ వారి సెలబ్రిటి ఇంటర్వ్యూల మాదిరి, యూట్యూబ్ వీడియోలు చేస్తుంటారు. Youtube Smartphone Smart Video Viewing Android App

ఆన్ లైన్లో వెబ్ సైట్ వీడియో, వ్యక్తి చిత్రీకరించిన వీడియో, మొబైల్ అప్ వీడియో, ఈవెంట్ వీడియో, ఈవెంట్ హైలైట్స్ వీడియో, న్యూస్, PAST టీవీ ప్రోగ్రామ్స్ ఏదైనా వీడియో అయితే అది యూట్యూబ్ వీడియో కావాల్సిందే. ఒకేసారి వినడం చూడడం వలన విషయముపై అవగాహన సులభంగా ఉంటుంది, మరియు తక్కువ సమయంలో విషయం అవగతమవుతుంది. అందుకే ఏదైనా విషయముపై అవగాహన బ్లాగుల కన్న వివరించే వీడియోలు ఎక్కువ ఉండవచ్చు.

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 View Enlisted Gadget Apps

bpr