Google Play Store Android Application Installation Process – Telugu

Google Play Store Android Application Installation Process – Telugu

Google Play store Android application installation process – Telugu :అందుబాటు ధరలలో లభించే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ అప్స్ చాలానే ఉంటాయి. మనం కొత్తగా కొన్న ఫోన్లో కానీ, వాడుతున్న ఫోన్లో కానీ install చేయబడిన మొబైల్ అప్స్ అప్డేట్స్ అందుబాటులో ఉంటే అప్డేట్ చేసుకోవాలి అని అంటారు. అందుబాటులో ఉన్న అప్స్ అప్డేట్స్ మరియు న్యూ అప్ ఇన్స్టాల్ ఎలాగో చూస్తే.

AndroidMobileAppsMoviesMusicBooksNewsstandDevicesPlayStore

గూగుల్ ప్లే స్టోర్ మెను

ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకి Apps అడ్డా ! ప్లే స్టోర్ మెను లిస్టులో మొదట Apps – Movies – Music – Books – Newsstand – Devices ఉండి, వెబ్ పేజిలో అయితే ఎడమప్రక్క చిత్రంలో చూస్తున్న విధంగా నిలువుగా మెను ఉంటుంది. మొబైల్ అయితే అడ్డంగా మెను

AndroidMobileAppsMoviesMusicBooksNewsstandDevicesPlayStoreMenuఅడ్డు వరుసలో డిస్ప్లే అవుతుంది. ప్రక్క చిత్రంలో ఉన్నట్లు. హోం క్లిక్/టచ్ చేస్తే ప్లే స్టోర్లో మొదటి పేజిలోకి వస్తుంది. అప్స్ లో వివిధ అంశాలలో వివిధ విషయాల మీద  రకరకాల మొబైల్ అప్లికేషన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. మళ్లి అందులో Top Charts మెనులోకి వెళితే ఉచిత మరియు రుసుం చెల్లించి ఎక్కువ డౌన్ లోడ్ అయిన అప్స్ మరియు గేమ్స్ వరుసలో కనిపిస్తాయి. కేటగిరిస్ చూస్తే, అప్స్ మరియు గేమ్స్ లో వర్గాలుగా కనిపిస్తాయి. కావాల్సిన కేటగిరిపై క్లిక్ / టచ్ చేస్తే సంభందిత మొబైల్ అప్స్ లేక గేమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇంకా ఎడిటర్ ఛాయస్ న్యూ రిలీజ్, ట్రెండింగ్ అప్స్ లేక గేమ్స్ మొదలగు వర్గాలుగా కనిపిస్తాయి.

Click here read some smart phone tips

How To Add Gmail Account For Your Smartphone

ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లోను కొన్ని సిస్టం అప్స్ తోబాటు, మరికొన్ని మొబైల్ అప్స్, ఆ ఫోను తయారిదారు ముందుగా ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. మీరు స్మార్ట్ ఫోను కొనగానే స్విచ్ ఆన్ చేయగానే, జిమెయిల్ ఎకౌంటు లాగిన్ అడుగుతుంది, ఒకవేళ షాపుకు సంభందించిన వ్యక్తే, ఫోను ఆన్ చేసి ఇస్తే, మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు ఎకౌంటు లాగిన్ అవ్వమని కానీ ఎకౌంటు క్రియేట్ చేయమని అడుగుతుంది. మీకు జిమెయిల్ ఎకౌంటు ఉండి ఉంటే మీరు జిమెయిల్ ఎకౌంటుతో లాగిన్ అవ్వవచ్చు. మీకు షాపులో వ్యక్తి మొదటిసారి స్విచ్ ఆన్ చేసి ఇచ్చిన స్మార్ట్ ఫోన్లో మీరు మొబైల్ అప్స్ కోసం ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఈ క్రింది image లో 1 వ ఇమేజిలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు ముందుగా ఫోన్ ఆన్ చేసినప్పడు జిమెయిల్ ఏడ్ద్ చేసినా, చేయించి ఉన్నా క్రింది image లో రెండవ ఇమేజిలో చూపిన విధంగా ఎకౌంటు ఎంచుకోమని రేడియో బటన్ సింబల్ ఫోన్లో లాగిన్ అయ్యి ఉన్న మెయిల్ చూపుతుంది. అప్పటికే జిమెయిల్ ఏడ్ చేసిన మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే తరువాత కన్ఫర్మేషన్ అడుగుతుంది.

GmailAddToViewEnlistedGadetAppsGooglePlayStore

ఇంకా మీ ఫోన్లో జిమెయిల్ ఏడ్ అయ్యి ఉండకపోతే, మీరు పై image నందు మూడవ ఇమేజిలో చూపిన విధంగా మీ ఫోను నెంబర్ కానీ మెయిల్ తో లాగిన్ అవ్వవచ్చు. Email or phone అని అడిగిన చోట మీరు ఫోన్ నెంబర్ కానీ, జిమెయిల్ గాని ఎంటర్ చేస్తే, పాస్ వర్డ్ అడుగుతుంది. పాస్ వర్డ్ కూడా ఎంటర్ చేయగానే ఈ క్రింది image లో ఉన్న 4-5-6 ఇమేజులు చూపిన విధంగా కన్ఫర్మేషన్ ఓకే చేస్తే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆండ్రాయిడ్ మొబైల్ అప్స్, గేమ్స్, మూవీస్, మ్యూజిక్, న్యూస్ స్టాండ్ విభాగాలలో అప్స్ కనబడతాయి.

Click here to read some smart tips

GmailAddToPlayStoreForViewEnlistedGadgetApps

పై image లో 4వ ఇమేజిలో సూచనలు చూశాక, క్రిందగా కుడి కార్నర్లో ఉన్న MORE పై క్లిక్ / టచ్ చేస్తే 5వ ఇమేజిలో మాదిరి  మరల కొన్ని సూచనలు వచ్చి క్రిందగా కుడి కార్నర్లో ఉన్న YES, I’M IN > పై టచ్ చేస్తే మీ మెయిల్ క్రిందగా గూగుల్ వారి Terms of Services, Privacy Policy ఉండి, క్రిందగా కుడి కార్నర్లో ACCEPT > ఉంటుంది. ఆ ACCEPT పై టచ్ చేస్తే 6వ ఇమేజ్ మాదిరి స్క్రీన్ వస్తుంది. అక్కడ గూగుల్ సర్వీస్, గూగుల్ డ్రైవ్ బ్యాక్ అప్ details ఉండి, క్రిందగా కుడి కార్నర్లో ఉన్న NEXT > పై టచ్ చేస్తే 7వ ఇమేజ్ కనిపిస్తున్నట్లు అందుబాటులో ఉన్న మొబైల్ అప్స్ మరియు గేమ్స్ ఓపెన్ దిస్ప్లీ అవుతాయి.

Click here to read smartphone performance

How To Available Updates For Your Smartphone

UpdatingAvailableUpdatesInAndroidSmartphoneForMobileApps

పై image లో 8 ఇమేజ్ ఎడమ పై బాగాన 3 అడ్డు గీతలు కలిగి TOGGLE బటన్ (a బాణం గుర్తుతో చూపినట్లు) ఉంటుంది, అక్కడ టచ్ చేస్తే మీ ఎకౌంటుపై, ఆ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన, అప్డేట్ చేయవలసిన మొబైల్ అప్స్ మరియు గేమ్స్ 9వ ఇమేజ్ లో ఉన్నట్టు చూపుతుంది. 9వ ఇమేజ్ b బాణం గుర్తు చూపుతున్న My apps & games పై టచ్ చేస్తే 10వ ఇమేజ్ ఉన్నమాదిరి స్క్రీన్ వస్తుంది. దీనిలో c బాణం గుర్తు సూచించిన UPDATE ALL బటన్ పై క్లిక్ చేస్తే అప్డేట్ చేయవలసిన అప్స్ అన్ని అప్డేట్ అవుతాయి. d బాణం గుర్తు చూపిన చోట UPDATE బటన్ ఉంది, అంటే అప్డేట్ చేయవల్సిన మొబైల్ అప్స్ ఒక్కొక్కటిగా అప్డేట్ చేయవచ్చు. పైన తరువాత ఇమేజ్ లో e బాణం గుర్తు సూచిస్తున్న చోట OPEN బటన్ ఉంది, ఆ బటన్ పై టచ్ చేస్తే ఆ అప్ ఓపెన్ అవుతుంది. ఇక మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్ అయిన మొబైల్ అప్ ఉపయోగించవచ్చు.

ఇంకా తరువాత ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్న మొబైల్ అప్స్ కి సంభందించిన అప్డేట్స్ అందుబాటులో ఉంటే, ఎన్ని అప్స్ అప్డేట్స్ అందుబాటులో ఉంటే అన్ని అప్స్ డీటెయిల్స్ మరియు UPDATE బటన్ పై image లో 10వ ఇమేజ్లో d బాణం గుర్తు చూపుతున్న మాదిరి. ఎప్పుడైనా పైన ఇమేజూలో a,b,c,d బాణం గుర్తులు సూచిస్తున్నబటన్స్ టచ్ చేయడం ద్వారా అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ అప్స్ అప్డేట్ చేసుకోవచ్చు.

Click here to read cooking tips mobile apps

HowToInstallNew MobileApp inyour smartphone

HowToInstallAndroidMobileAppsInSamsungSmartphone

ఇంకా ఏదైనా కొత్త మొబైల్ అప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలంటే, సులభంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడుని బట్టి, వేగంగా అప్స్ ఇన్స్టాల్ చేయవచ్చు. పై image లో 12 ఇమేజ్ a బాణం గుర్తుపై టచ్ చేస్తే టాప్ చార్టులలో గల అప్స్ కనబడతాయి. వాటిలో కావాల్సిన అప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా సెర్చ్ చేసి కూడా అప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 12, 13 ఇమేజులు గమనిస్తే Google Play అని వ్రాసి ఉంది. మీ మొబైల్ స్క్రీనుపై కూడా ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు Google Play అని ఉన్న చోట టచ్ చేస్తే, సెర్చ్ బార్ కర్సర్ హైలైట్ అవుతాయి. అక్కడ మీకు కావాల్సిన అప్స్ సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ప్లే స్టోర్లో టాప్ చార్టులలో కానీ లేదా సెర్చ్ కానీ చేసిన తరువాత వరుసగా అప్స్ కనిపిస్తుంటాయి, క్రిందికి స్క్రోల్ చేసే కొలది అప్స్ డిస్ప్లే అవుతాయి. పై image లో 13వ ఇమేజ్ చూస్తే b బనగ గుర్తు చూపుతున్న మూడు (dots) చుక్కలు నిలువుగా ఉన్నాయి. కచ్చితంగా 3 చుక్కలు (dots) పై క్లిక్ చేస్తే install బటన్ c బాణం గుర్తు చూపుతున్నట్టు వస్తుంది. install బటన్ పై క్లిక్ చేస్తే, 15వ ఇమేజ్ లో మాదిరి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. 3 చుక్కలు కాకుండా డైరెక్టుగా అప్ ఐకానుపై టచ్ చేస్తే పై image లో 14వ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పై 14వ ఇమేజ్ లో d బాణం గుర్తు సూచిస్తున్న install బటన్ గ్రీన్ బ్యాక్ గ్రౌండుతో ఉంది, అక్కడ టచ్ చేస్తే, మీ అప్ installation క్రింది ఇమేజ్ మాదిరి జరుగుతుంది.

Click here to read smartphone shopping apps

AppInstallationProcessFromPlayStoreForAndroidNewMobileInstall

పై image లో 16వ ఇమేజ్ లో డౌన్లోడ్ ప్రాసెస్, 17వ ఇమేజ్ లో డౌన్ లోడింగ్ డేటా సైజు, డీటెయిల్స్, 18వ ఇమేజ్ లో installation ప్రాసెస్ జరుగుతన్నట్లు గమనించగలరు. మీరు ఏ మొబైల్ అప్ ఇన్స్టాల్ చేస్తున్న ప్రాసెస్ Samsung Galaxy J2 ఆండ్రాయిడ్ ఫోన్లో ఇలా జరుగుతుంది. ఇంచుమించు అన్ని ఫోన్లలో ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. 19వ ఇమేజ్ చూస్తే అక్కడ a,b బాణం గుర్తులు సూచిస్తున్నట్లు ఉంటే మీ మొబైల్ స్క్రీన్ ప్లే స్టోర్లో డిస్ప్లే అయ్యిందంటే, అక్కడ ఉన్న అప డీటెయిల్స్ సంభందించిన అప్ మీ స్మార్ట్ ఫోన్లో  ఇన్స్టాల్ అయినట్లే.

Click here to sea new smartphones

Observable thing of Mobile app permissions to install in your phone

కుడి SmartphoneAppInstallationTimeMustObserveHowmanyPersmissionsToMobileAppInstallప్రక్క చిత్రం చూడండి షేర్ ఇట్ అప్ నేమ్ b బాణం గుర్తు సూచిస్తుంది. a బాణం గుర్తు needs access to అని ఇంగ్లీష్ అక్షరాలు సూచిస్తుంది. అంటే a బాణం గుర్తు సూచించేది ఏమిటంటే, ఈ అప్ క్రింది లిస్టులో ఉన్న ఫోన్ ఫీచర్స్ ఉపయోగించడానికి అనుమతులు అడుగుతుంది. మీరు క్రింద గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండుతో ఉన్న ACCEPT బటన్ పై క్లిక్ చేస్తే, అప్ అడుగుతున్నా అనుమతులు మీరు అనుమతించినట్టే! ఇలా ఈ అనుమతులు మీరు ఈ అప్ వాడుతున్నప్ప్తుడు, ఆ అప్ లో మీరు చేస్తున్న టాస్క్ ఆధారంగా మీ ఫోన్లో మీరు అంగీకరించిన అనుమతులను అప్ వాడుకుంటుంది. ఉదా: మీరు షేర్ ఇట్ అప్ ఉపయోగించి మీరు మీ ఫోన్లో స్టోర్ అయ్యి ఉన్న వీడియో ఫైల్ ఇతర ఫోన్లోకి షేర్ చేస్తున్నపుడు, ఆ అప్ మీడియా ఫైల్స్, వైఫై కనెక్షన్, లొకేషన్ వంటి ఫీచర్స్ వాడుతుంది. ప్రక్క ఇమేజ్లో చూస్తే కనిపించే లిస్టులో మీడియా ఫైల్స్, వైఫై కనెక్షన్ ఫీచర్స్ పై కూడా అనుమతి అడుగుతుంది. అంటే ఏ అప్ వారు డిజైన్ చేసిన ప్రయోజనాలను, వినియోగాదారుకి ఈ అప్ అందించాలంటే, వినియోగదారుని ఫోన్లో ఏఏ ఫీచర్స్ పై అనుమతులు కలిగి ఉంటే అప్ సరిగా పనిచేస్తుందో, ఆయా అనుమతులు అప్ install చేసేటప్పుడు అడుగుతుంది.

పై పద్దతిలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

మరిన్ని విషయాలు తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – ViewEnlistedGadgetApps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *