Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps

Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps

Instant money transfer, recharge, shopping payment wallet mobile apps for smartphone users in Telugu. ఆన్ లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్మార్ట్ ఫోన్లో మొబైల్ బ్యాంకింగ్ వలన  బ్యాంకు బ్రాంచికి వెళ్ళే పనిలేకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ గాని మొబైల్ బ్యాంకింగ్ గాని ఉపయోగించి నగదు లావాదేవీలు పూర్తిచేయవచ్చు బ్యాంకు మరియు కస్టమర్ సమయం సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, క్విక్ ట్రాన్స్ఫర్ ఉపయోగించి రోజుకి సంభందిత బ్యాంకు పరిమితిలో నగదు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

అయితే స్మార్ట్ ఫోను వచ్చాక, ఫోన్ రీఛార్జి, డి.టి.హెచ్. రీఛార్జి లాంటివి, ఇంకా షాపింగ్ అప్స్ లో చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఇలా చిన్నవాటికి అస్తమానం బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయకుండా, కొన్ని మొబైల్ పేమెంట్ వాల్లెట్స్ ఉపయోగపడతాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు మొబైల్ అప్స్ రూపంలో గూగుల్ ప్లే స్టోర్లో అనేక పేమెంట్ వాల్లెట్ మొబైల్ అప్స్ లభిస్తాయి.




ఈ మొబైల్ పేమెంట్ వాల్లెట్ అప్ నందు కొంత నగదు Add చేస్తే, ఆ నగదుని చిన్న చిన్న ఖర్చులకు, సంభందిత అప్ సెక్యూరిటీతో ఖర్చు చేయవచ్చు. ఈ పేమెంట్ వాల్లెట్ వలన ప్రతి చిన్నపేమెంట్ కోసం బ్యాంకు ఎకౌంటు లాగిన్ అవసరం ఉండదు. ఇలాంటి పేమెంట్ సదుపాయం కలిగిన మొబైల్ అప్స్ చాలానే లభిస్తాయి. వాటిలో ఎక్కువగా bhim, paytm, phonepe, mobiquick, google tej, samsung pay, skrill, airtel, idea ఇలా ప్రాచుర్యం పొందిన అనేక కంపెనీలు పేమెంట్ వాల్లెట్ మొబైల్ అప్స్ అందుబాటులోకి తెచ్చారు. కొన్ని అప్స్ ఉపయోగించి ఇతర అకౌంటులకు మనీ సెండ్ చేయవచ్చు. ఇవి అప్పటికప్పుడు అవసరానికి ఉపయోగపడేవిగా ఉంటాయి.

సులభపద్దతులు ఎప్పుడూ ఎక్కువమందికి అనుకూలంగానే ఉంటాయి, కావున వాటిలో లోటుపాట్లు కూడా తెలుసుకుని ఆ సులభ పద్దతిని అనుసరించడం మంచిది అని చెబుతూ ఉంటారు. అది డబ్బు విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ ఆప్ ప్రొవైడర్స్ రక్షనాత్మకమైన చర్యలతో సదుపాయాలు అందించినా ఉపయోగించే విధానం కూడా రక్షనాత్మకమై ఉండాలి అని అంటారు.

క్రింది చిత్రాలకు మొబైల్ ఆప్స్ లింక్ చేయబడి ఉన్నాయి, మీరు క్రింద చిత్రాలపై క్లిక్ / టచ్ చేసే సదరు మొబైల్ ఆప్ యొక్క గూగుల్ ప్లే స్టోర్ వెబ్ పేజి లేక మొబైల్ ప్లే స్టోర్ ఆప్ పేజి ఓపెన్ అవుతుంది. అందులో మీరు డౌన్ లోడ్ చేయబోతున్న మొబైల్ ఆప్ యొక్క టర్మ్స్ మరియు కండిషన్లు చదివి డౌన్ లోడ్ చేయగలరు..

Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps
Phone Pay Mobile App
Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps
Paytm Mobile App
Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps
Pockets-UPI Mobile App
Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps
Bhim Mobile App
Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps
Tej Mobile App
Money Transfer, Recharge, Shopping Payment Wallet Mobile Apps
SBI Buddy App

 

 

ధన్యవాదాలు
vega2020View Enlisted Gadget Apps And Games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *