Wednesday, October 17, 2018
Home > ViewEnlistedGadgetApps > Smartphone Home Screen – Chrome Search Bar Voice Searching

Smartphone Home Screen – Chrome Search Bar Voice Searching

Smartphone Home Screen Chrome Search Bar Voice Searching

Smartphone Home Screen Chrome Search Bar Voice Searching in Android mobile -Telugu స్మార్ట్ ఫోన్ క్రోమ్ బ్రౌజర్: ఫోను ద్వారా ఇంటర్నెట్ ఆధారిత ఆన్ లైన్లో ఏది వెతకాలంటే కావాల్సింది బ్రౌజరు. స్మార్ట్ ఫోన్ల బ్రౌజర్లలో బాగా ప్రసిద్ది బ్రౌజర్లలో ఒక బ్రౌజరు గూగుల్ వారి క్రోమ్, ఇంకొకటి ఆండ్రాయిడ్ ఇంటర్నెట్ బ్రౌజరు. రెండు ముందుగానే స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసుకోవలసిన అవసరం లేదు. ప్రత్యేకమైన బ్రౌజర్లలో ఎక్కువగా వాడేది మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజరు ఒకటి. ఇదైతే  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనుకి, ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవలసి వుంటుంది.

Smartphone Home Screen Chrome Search Bar Voice Searchingగూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషను ఫాస్ట్ ఇంటర్నెట్ సర్ఫింగ్ బ్రౌజరు. ఆన్ లైన్లో అవసరమైన విషయాల గురించి స్మార్ట్ ఫోను నుండి సులభంగా సెర్చింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోనులో హోం స్క్రీనుపై సెర్చ్ బార్ తెలుపు రంగు బ్యాక్ గ్రౌండుతో Google లోగో ఎడమవైపుగా ఉండి, కుడివైపున వాయిస్ రికార్డర్ ఐకాన్
ఉండి, ఆ ఐకానుకి గూగుల్ ఐకానుకి మధ్యలో Say “Ok Google” అని ఉంటుంది. ఇక్కడ వాయిస్ రికార్డర్ ఐకానుపై
టచ్ చేసి, మీరు స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్లో వాయిస్ సెర్చ్ చేయవచ్చు. సెర్చ్ బార్ వాయిస్ రికార్డుతో మీ మాటలను క్యాచ్ చేసి ఫోన్లో, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం మీ మొబైల్ స్క్రీనుపై చూపుతుంది. లేక టైపు చేసి ఇంటర్నెట్ సెర్చ్ చేయవచ్చు. తరువాత మీరు కావాల్సిన లింకులపై టచ్ చేసి ఆన్ లైన్ అవసరమైన విషయలు వెతికి తెలుసుకోవచ్చు. కుడి ప్రక్కగా ఉన్న చిత్రం గమనిస్తే బాణం గుర్తు సూచిస్తున్న వైట్ బ్యాక్ గ్రౌండ్ బార్ Google సెర్చ్ బార్. సెర్చ్ చేసేటప్పుడు, టైపు చేస్తూండగానే మీకు పదాలు ఎంపికలో సహాయంగా కొన్ని పదాలు చూపుతూ ఉంటుంది. సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ పదాలుపై మీరు టచ్ చేస్తే, వాటిని వెతికే పదాలుగా సెర్చ్ ఇంజిన్ తీసుకుని మీరు సెర్చ్ చేస్తున్న అంశానికి సంభందించిన విషయాల లింకులను చూపుతుంది. స్మార్ట్ ఫోను హోం స్క్రీనుపై కనిపించే సెర్చ్ బారు ఉపయోగించి ఈ విధంగా వాయిస్ సెర్చ్ లేక వర్డ్స్ టైపు చేస్తూ సెర్చ్ చేయవచ్చు. వాయిస్ స్పీకింగ్ సెర్చ్ చాలా సులభం. క్రింది చిత్రం చూడండి. Smartphone Home Screen Chrome Search Bar Voice Searching

Smartphone Home Screen Chrome Search Bar Voice Searching

పై చిత్రంలో 1వ స్క్రీనులో b అని వ్రాసి ఉన్న బాణం గుర్తు సూచించే ఐకానే, వాయిస్ రికార్డర్ ఐకాన్. ఆ ఐకానుపై టచ్ చేస్తే 2వ స్క్రీనుగా మీ ఫోన్ స్క్రీన్ డిస్ప్లే అవ్తుతుంది. c బాణం గుర్తు సూచిస్తున్న సింబల్ వాయిస్ కోసం సెర్చింగ్ చేస్తున్న సింబల్. ఉదా: మీరు మీ ఫోను మైక్రో ఫోను దగ్గర contacts అని మాట్లాడితే, contacts అనే ఇంగ్లీష్ అక్షరాలు స్క్రేనుపై ఆటోమేటిక్ గా టైపు చేయబడతాయి, కేవలం మీ వాయిస్ ఆధారంగా..



పై చిత్రంలో 3వ స్క్రీను, d బాణం గుర్తు సూచిస్తున్న అక్షరాలు చూడండి  క్యాచ్ చేసిన వాయిస్ ఆధారంగా అక్షరాలు అదే టైపు చేసుకుని, ఆ అక్షరాలకు సంభందించి ఆన్ లైన్లో ఉన్న సమాచారం కోసం గూగుల్ సెర్చ్ వెతుకుతుంది. పై చిత్రంలో 4వ స్క్రీను d బాణం గుర్తు చూడండి, అక్కడ నీలం (Blue) రంగులో ఉన్న అక్షరాలు Google Contacts, దాని క్రిందగా గ్రీన్ కలర్లో ఉన్న అక్షరాలు, గూగుల్ కాంటాక్ట్స్ యొక్క వెబ్ పేజి అడ్రస్. గూగుల్ సెర్చ్ ఎప్పుడూ మనం సెర్చ్ చేసే పదానికి సరి అయిన మ్యాచ్ వివరాలు, మరియు ఆ వివరాలు ఎక్కువమంది యూజర్స్ వాడుతుంటే, ముందుగా  వాటినే చూపుతుంది. ఇప్పడు ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కువ కాబట్టి, చాలామంది contacts జిమెయిల్లో సేవ్ చేస్తారు కాబట్టి, గూగుల్ కాంటాక్ట్స్ ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు అని చెప్పవచ్చు. అలా గూగుల్ కాంటాక్ట్స్ ముందుగా చూపించింది.

పైన వివరించిన విధంగా స్మార్ట్ హోం స్క్రీనుపై కనిపించే గూగుల్ సెర్చ్ బార్ ఉపయోగించి, క్రోమ్ ద్వారా ఆన్ లైన్లో మనకి కావాల్సిన విషయాలపై వెతికి చూసుకోవచ్చు.

మరిన్ని విషయాలు తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

bpr